Urination Problem: సాధారణంగా మనలో చాలా మంది తరచూ మూత్ర విసర్జనకు వెళ్తుంటారు. చాలా వరకు ఇది సర్వసాధారణమైన సమస్యే కానీ, కొన్ని సందర్భాల్లో మాత్రం ఆరోగ్యం పై ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. మామూలుగా ఎవరైనా తరచూ యూరిన్ కు వస్తున్నట్లయితే వారి సమస్యకు డయాబెటిస్ కారణమని భావిస్తాం. షుగర్ వ్యాధిగ్రస్తులు తరచుగా మూత్ర విసర్జనకు వెళ్తుంటారన్న సంగతి తెలిసిందే. అయితే అందరిలో ఈ లక్షణం మధుమేహం కాదని వైద్యులు చెబుతున్నారు. అదేంటి ? షుగర్ కానప్పుడు ఆ విధంగా ఎక్కువసార్లు యూరిన్ కు ఎందుకు వెళ్తున్నారు? అనుకుంటున్నారా?
తరచుగా మూత్రవిసర్జన చేయడంపై మెడికల్ జర్నల్ ది లాన్సెట్ పరిశోధన జరిపిందని తెలుస్తోంది. దీని ప్రకారం ఈ విధంగా యూరిన్ కు వెళ్లడం ప్రోస్టేట్ క్యాన్సర్ కు కారణం అయ్యే విస్తారిత ప్రోస్టేట్ లక్షణం అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.
మూత్ర విసర్జనకు ఎక్కువ సార్లు వెళ్తున్న వారిలో మధుమేహం సమస్య లేనట్లయితే వారు పీఎఫ్ఏ అనే పరీక్షను చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. సాధారణంగా మగవారిలో వచ్చే క్యాన్సర్స్ లో ఇది కూడా ప్రధానమైనదని చెప్పుకోవచ్చు. వయసు పైబడే కొద్దీ ఈ క్యాన్సర్ బారిన పడే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.
ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలు ఏంటో ఒకసారి చూద్దాం. యూరిన్ లో రక్తం రావడంతో పాటు మూత్రవిసర్జనకు వెళ్లిన సమయంలో ఇబ్బందిగా ఉన్నా, అత్యవసరంగా యూరిన్ కు వెళ్లాల్సిన అవసరం ఉన్నట్లు అనిపించిన ఈ క్యాన్సర్ లక్షణాలు అని భావించవచ్చు. వయసు పెరుగుతున్న వారిలో ఇటువంటి లక్షణాలు కనుక కనిపిస్తే వైద్యుడిని సంప్రదించడం మంచిది. అలాగే ఎప్పటికప్పుడు రెగ్యులర్ చెకప్ లు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా క్యాన్సర్ లక్షణాలు చివరి వరకు కనిపించవు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా 40 సంవత్సరాలు దాటిన వారిలో తరచుగా యూరిన్ సమస్య వేధిస్తుంటే మాత్రం నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ల వద్దకు వెళ్లాలని చెబుతున్నారు.