లైఫ్ స్టైల్Children: మీ పిల్లలకు సెల్‌ఫోన్‌ ఇస్తున్నారా?.. అయితే మీరే ప్రమాదంలోకి నెడుతున్నారు!

Children: మీ పిల్లలకు సెల్‌ఫోన్‌ ఇస్తున్నారా?.. అయితే మీరే ప్రమాదంలోకి నెడుతున్నారు!

Children: ఈమధ్య కాలంలో స్మార్ట్‌ ఫోన్‌ వాడకం చాలా ఎక్కువైంది. పెద్దల నుంచి చిన్న పిల్లల వరకూ అందరూ స్మార్ట్‌ ఫోన్‌ వినియోగిస్తున్నారు. ఇక కొంతమంది తల్లిదండ్రులే తమ పిల్లలకు ఫోన్లు చూడమని ఇస్తున్నారు. రెండు, మూడేళ్ల పిల్లలు కూడా ఫోన్‌ చూస్తేనే అన్నం తినే పరిస్థితి వచ్చింది. క్రమంగా ఇది అలవాటుగా మారి వయసు పెరుగుతున్న కొద్దీ ఫోన్‌ చూడడం వ్యసనంగా మారుతోంది. పిల్లలు ఏడ్చినప్పుడు, తమ పనికి ఆటంకం కలిగినప్పుడు కూడా ఫోన్‌ చేతికి ఇచ్చి చూడమని చెబుతున్నారు.

ఫోన్‌ చూస్తేనే భోజనం..
ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో రెండేళ్ల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లల్లో 90 శాతం మంది సెల్‌ఫోన్‌ చూస్తేనే అన్నం తింటున్నట్లు తేలింది. ఇందుకు బాధ్యులు తల్లిదండ్రులే అని సేపియన్‌ ల్యాబ్స్‌ చేసిన సర్వేలో గుర్తించారు. è మ పిల్లలు మారాం చేయకుండా కండుపు నిండా తింటే చాలు అని సెల్‌ఫోన్‌ ఇవ్వడం మొదలు పెడుతున్నారు. దానితో కలిగే దుష్ప్రభావాలను పట్టించుకోవడం లేదు. 40కిపైగా దేశాల్లో చేసిన ఈ సర్వేలో అనేక దుష్పరిణామాలు ఉంటాయని నిర్ధారణ అయింది.

ఈ ప్రమాదాలు..
= ఎక్కువగా సెల్‌ఫోన్‌ చూడడం వలన మానసికంగా, శారీరకంగా కూడా చెడు ప్రభావం పడుతుంది. పిల్లలు ఎక్కువగా స్మార్ట్‌ ఫోన్‌ చూస్తే అది మెదడుపై ప్రభావం చూపుతుంది.

= సెల్‌ఫోన్‌ చూసే ప్రతీ పిల్లల్లో నలుగురికంటే ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. ఎవరితో మాట్లాడరు. ఇది దీర్ఘకాలిక సమస్యకు దారితీస్తుంది.

= ఫోన్‌ చూస్తూ భోజనం చేయడం వలన వారు ఏం తింటున్నారు అన్నది కూడా గమనించరు. దీంతో వాళ్లు తినే ఆహారం చురి కూడా తెలియకుండా పోతోంది. .

= తిండి ఎలా ఉంది కూడా అర్థం చేసుకోర. కొంతమంది ఫోన్‌ చూస్తూ ఎక్కువగా అన్నం తినేస్తుంటారు. కొందరు తక్కువగా తింటారు. ఈ కారణంగా ఊబకాయం లేదా, బలహీనంగా మారిపోయే ప్రమాదం ఉంది.

= ఎక్కువగా ఫోన్‌ చూడడం వలన చిన్న వయసులోనే కంటిచూపు దెబ్బతింటుంది. కళ్లజోడు వాడాల్సిన పరిస్థితి వస్తుంది. చిన్నప్పటి నుంచి స్క్రీన్‌ దగ్గరగా చూడడం వలన రెటీనా దెబ్బతినే అవకాశం ఉంది.

= ఫోన్‌ చూస్తూ అన్నం తినడం వలన తల్లీ బిడ్డల బంధంపై చెడు ప్రభావం పడుతుంది.

= మరో ప్రమాదకరమైన విషయం ఏమిటంటే అధికంగా ఫోన్‌ వాడినవారిలో ఆత్మహత్య ఆలోచనలు, కోపం, రియాలిటీకి దూరంగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయని సేపియన్‌ ల్యాబ్స్‌ సర్వేలో నిర్ధారణ అయింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

15 Minute Walk Benefits: ఇక వర్కౌట్లు అవసరం లేదు.. రోజూ 15 నిమిషాలు ఇలా చేస్తే.. ఆరోగ్యం మీ సొంతం.. ఏం చేయాలంటే..

15 Minute Walk Benefits: ప్రస్తుత బిజీ జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే గంటల తరబడి జిమ్‌లో చెమటోడ్చాల్సిందేనని చాలా మంది భావిస్తుంటారు. కానీ వైద్య నిపుణులు మాత్రం అలాంటి అపోహలు అవసరం...

Night Dinner Tips: రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రపోయే వారికి హెచ్చరిక..

Night Dinner Tips: రోజంతా పనులతో అలసిపోయిన చాలా మంది రాత్రి భోజనం చేసిన వెంటనే మంచంపైకి వెళ్లి నిద్రపోతుంటారు. అయితే ఈ అలవాటు ఆరోగ్యానికి మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు....

Most Popular

Pimples Solution: మొటిమల సమస్యతో బాధపడేవారికి గుడ్ న్యూస్..

Pimples Solution: మహిళల్లో హార్మోన్ల మార్పుల కారణంగా మొటిమల సమస్యతో బాధపడుతున్నట్లు చాలా వరకు వైద్య నివేదికలు చెబుతున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి కొందరు అత్యధికంగా డబ్బులు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్...

Deep Sleep Tips: వెంటనే గాఢ నిద్ర పట్టాలని అనుకుంటున్నారా… ఇలా చేయండి..

Deep Sleep Tips: నేటి వేగవంతమైన జీవనశైలిలో చాలా మంది నిద్రలేమి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, మొబైల్ లేదా టీవీని ఎక్కువసేపు చూడడం, భోజనం చేసిన వెంటనే పడుకోవడం...

Fatty Liver: అలసట..ఆకలి తగ్గడంతో పాటు ఈ సమస్యలు ఉన్నాయా..

Fatty Liver: అలసట, కుడివైపు పొత్తికడుపు పైభాగంలో అసౌకర్యం, బరువు పెరగడం, ఆకలి తగ్గడం వంటి లక్షణాలు చాలా మందిలో కనిపిస్తాయి. అయితే వీటిని లైట్ గా తీసుకుంటారు. పెద్ద ఆరోగ్య సమస్య...

sunflower seeds : ఒక స్పూన్ సన్‌ఫ్లవర్ సీడ్స్ తో ఇన్ని ఆరోగ్య లాభాలా.. వీటిని ఎలా తినాలి..

sunflower seeds : ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ డ్రై ఫ్రూట్స్, విత్తనాల వినియోగం కూడా పెరుగుతోంది. దీంతో చాలా మంది రోస్ట్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ కు వ్యతిరేకంగా అందుబాటులో ఉన్న...

India Smartphone Market : ‘స్మార్ట్ ఫోన్’ కు షాక్.. కొనేందుకు ముందుకు రావడం లేదు.. 10 శాతం...

India Smartphone Market : భారతదేశ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ కు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. రకరకాల కారణాలతో మొబైల్స్ సేల్స్ తగ్గిపోయాయి. గడిచిన ఆరేళ్లలోనే ఎన్నడూ లేనంతగా 2026 జూన్ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)...
Exit mobile version