Homeలైఫ్ స్టైల్Office Exercise: ఆఫీస్ లో బోలెడంత పని.. వ్యాయామానికి టైం ఏదీ.. అలాంటి వాళ్ళు ఇలా...

Office Exercise: ఆఫీస్ లో బోలెడంత పని.. వ్యాయామానికి టైం ఏదీ.. అలాంటి వాళ్ళు ఇలా చేయాలి

Office Exercise: నేటి కాలంలో ఉరుకుల పరుగుల జీవితమే అందరిదీ. నగరాలలో ఉన్న వారి పరిస్థితి మరింత దారుణం. ఎందుకంటే ఉండే చోటు ఒక దగ్గర.. పనిచేసే చోటు మరొక దగ్గర ఉంటుంది. పైగా ట్రాఫిక్ జామ్.. ఇలాంటప్పుడు ముందుగానే ఆఫీసు వెళ్లాలి. అలాంటప్పుడు వేగంగా పనులు పూర్తి చేసుకోవాలి. ఇలాంటప్పుడు వ్యాయామం చేయడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది.. పైగా కార్యాలయంలో కూర్చుని పనిచేయాల్సి ఉంటుంది. శారీరక శ్రమ ఉండదు. అలాంటప్పుడు శరీరంలో కొవ్వు నిల్వలు పేరుకు పోతాయి. రకరకాల వ్యాధులు సంభవిస్తుంటాయి.

నగరాలు, పట్టణాలలో పనిచేసేవారు వ్యాయామం చేసే వీలు లేక ఇబ్బంది పడుతుంటారు. అటువంటివారు ఇలా చేస్తే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడంవల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మాత్రమే కాదు.. వ్యాయామం చేసినంత స్థాయిలో శరీరంలో కొవ్వులను కరిగించుకుంటారు. దీనివల్ల శరీరం రీ ఫ్రెష్ అవుతుంది. అంతేకాదు చేయడానికి ఉత్తేజం లభించి పనిచేయడానికి ఇంకా ఎక్కువ శక్తి లభిస్తుంది.

పని చేసే చోట లేదా ఇంట్లో ఐదు నిమిషాలకు ఒకసారి అటు ఇటు నడిచినా సరిపోతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. దీనివల్ల శరీరానికి వ్యాయామ లభిస్తుందని.. ఐదు నిమిషాలపాటు లభించే బ్రేక్ మూడ్ మతాన్ని సరిచేస్తుందని శాస్త్రవేత్తల అభిప్రాయపడుతున్నారు. ఆ సమయంలో పనిచేసే సామర్థ్యం పెరుగుతుందట. దీనికి సంబంధించి ఇటీవల శాస్త్రవేత్త చేసిన ప్రయోగాల వివరాలను బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ లో ప్రచురించారు. అమెరికాలోని నేషనల్ పబ్లిక్ రేడియో బాడీ ఎలక్ట్రిక్ ఛాలెంజ్ పేరుతో ఒక అధ్యయనం నిర్వహించారు. ఇందులో 19,300 మంది పాల్గొన్నారు.

ఇందులో సుమారు 11,484 మంది వారికి నచ్చినట్టుగా పని చేసే చోట ఐదు నిమిషాల పాటు నడవడం మొదలుపెట్టారు. కొందరు అరగంటకు ఒకసారి.. మరికొందరు గంట, రెండు గంటల వీరామంతో నడిచేవారు. ఇలా 21 రోజులు నడిచిన తర్వాత వారి నుంచి శాస్త్రవేత్తలు సమాచారం సేకరించారు. ఈ గ్యాప్ వల్ల వారిలో శారీరకంగా.. మానసికంగా ఆరోగ్యం మెరుగుపడింది. సానుకూలమైన దృక్పథాన్ని తీసుకొచ్చింది. కార్యాలయంలో పనిచేస్తున్నప్పుడు అరగంటకు ఒకసారి బ్రేక్ ఇవ్వడం సాధ్యం కాదు గాని.. రెండు గంటలకు ఒకసారి బ్రేక్ ఇవ్వడం మాత్రం ఆమోదయోగ్యమైనదేనని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Football Legends Retirement: దిగ్గజాల నిష్క్రమణ.. పుట్ బాల్ చరిత్రలో ముగిసిన స్వర్ణయుగం

Football Legends Retirement: ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన క్రీడ ఫుట్బాల్. అందుకే ఫిఫా ప్రపంచ కప్ కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. పైగా ఇది క్రీడల్లోకెల్లా అత్యధిక స్థాయిలో వీక్షణలు సొంతం...

US Iran Conflict: అమెరికా డేటా సెంటర్ పై దాడి.. ముదిరిన యుద్ధం

US Iran Conflict: గల్ఫ్‌ ప్రాంతంలో అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా మారాయి. రెండు దేశాలు పరస్పరం దాడులు, ప్రతీకార చర్యలతో పశ్చిమాసియా మొత్తం అగ్నిగుండంలా మారింది. వాణిజ్య నౌకల రాకపోకలకు...

FIFA World Cup Revenue: ఫిఫా ప్రపంచ కప్.. ఎన్ని వేల కోట్లు వచ్చాయో తెలుసా..

FIFA World Cup Revenue: ఈ ప్రపంచంలో అత్యంత ప్రజాధరణ పొందిన క్రీడలలో ఫుట్ బాల్ ముందు వరుసలో ఉంటుంది. దీనిని ప్రపంచంలో మెజారిటీ దేశాలు ఆడుతూ ఉంటాయి. అంతర్జాతీయ ఫుట్...

Amitabh Bachchan: ICU లో అమితాబ్ బచ్చన్.. అభిమానుల గుండెలు ఆగిపోయేలా చేస్తున్న లేటెస్ట్ పోస్ట్..

Amitabh Bachchan: 83 ఏళ్ళ వయస్సు లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ , నేటి తరం యంగ్ హీరోలతో పోటీ పడుతున్న ఏకైక ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అమితాబ్...

YSRCP Land Scam: వందల కోట్ల 15.94 ఎకరాల ప్రభుత్వ భూమిని వైసీపీ నేతలకు రాసి ఇచ్చేశాడు..

YSRCP Land Scam: వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా సరే బ్రహ్మాండంగా ముక్కలు పడతాయి.. ఈ సామెతను ఆ రెవెన్యూ అధికారి నిజం చేసి చూపించారు. తనకు ఆయాచితమైన చోటు...
Oktelugu Epaper
Exit mobile version