https://oktelugu.com/

Health Tips: టీవీ చూస్తూ కూర్చోని తింటున్నారా.. అయితే ఇది మీకోసమే!

కొంతమంది పిల్లల ఆహారపు అలవాట్లపై జరిపిన అధ్యయనంలో టీవీ చూస్తూ తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని గుర్తించారు. టీవీ లేదా మొబైల్ చూస్తూ తినడం వల్ల పదేళ్లలోపు పిల్లలు స్థూలకాయానికి గురయ్యే ప్రమాదం ఉందని అధ్యయనం తెలిపింది.

Written By:
  • Neelambaram
  • , Updated On : August 15, 2024 / 04:44 AM IST

    Health Tips

    Follow us on

    Health Tips: పూర్వం రోజుల్లో అయితే కుటుంబం అంతా కలిసి మాట్లాడుకుని భోజనం చేసేవాళ్లు. ఎంతైనా అప్పటి రోజులే బాగుండేవి. మళ్లీ అలాంటి డేస్ వస్తే బాగుండు అని చాలామంది అనుకుంటుంటారు. కానీ మళ్లీ ఆరోజులు రావడం కష్టమనే చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్‌లో ఎవరికి నచ్చిన టైంలో వాళ్లు తింటున్నారు. అలా టీవీలో ఏదో షో చూస్తూ ఒంటరిగా తింటున్నారు. కొందరైతే ఏదైనా టీవీలో చూస్తే తినడం అయిపోయిన తర్వాత కూడా అలా చూస్తూ అక్కడే ఉండిపోతాం. చేతులు కూడా కడుక్కోకుండా గంటల తరబడి టీవీ చూస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. తినేటప్పుడు ఎవరితో మాట్లాడకుండా, టీవీ చూడకుండా మౌనంగా తినాలని మన పెద్దవాళ్లు చెబుతుంటారు. కానీ మనం అవేం పట్టించుకోకుండా టీవీ చూస్తూనే తింటాం. ప్రస్తుతం చాలామంది తల్లులు పిల్లలు తినాలని వాళ్లకు మొబైల్ ఇచ్చి మరి తినిపిస్తారు. మొబైల్‌లో ఏదో ఒకటి చూస్తూనే తింటారు. లేకపోతే తినమని మారం చేస్తే తల్లులు వాళ్లకు మొబైల్ చూడటం అలవాటు చేస్తారు. అయితే తింటూ టీవీ, మొబైల్ చూడటం ఆరోగ్యానికి హానికరమని అధ్యయనాలు చెబుతున్నాయి.

    కొంతమంది పిల్లల ఆహారపు అలవాట్లపై జరిపిన అధ్యయనంలో టీవీ చూస్తూ తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని గుర్తించారు. టీవీ లేదా మొబైల్ చూస్తూ తినడం వల్ల పదేళ్లలోపు పిల్లలు స్థూలకాయానికి గురయ్యే ప్రమాదం ఉందని అధ్యయనం తెలిపింది. టీవీ చూసి తినేవాళ్ల కంటే కుటుంబంతో కలిసి తినడం వల్ల ఊబకాయం ప్రమాదాన్ని తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఒకేసారి తినడం, టీవీ చూడటం వల్ల మెదడు ఒత్తిడికి గురవుతుంది. టీవీ చూస్తూ ఏదో ఒకటి తినే వాళ్లలో మెటబాలిక్ సిండ్రోమ్ ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఒక మనిషికి ఉండే అలవాట్లను బట్టే వాళ్ల ఆరోగ్య పరిస్థితి ఉంటుంది. కాబట్టి చిన్నప్పటి టీవీ, మొబైల్ చూస్తూ తినడం వంటి అలవాట్లను పిల్లలకు మాన్పించండి. కుటుంబమంతా ఒకేసారి కలిసి తినేలా అలవాటు చేయండి.

    టీవీ లేదా మొబైల్ చూస్తూ తినడం వల్ల మనం తినే తిండి కంటే వాటిపైనే ఎక్కువ దృష్టి పెడతాం. దీనివల్ల శరీరంలోని జీవక్రియ మందగిస్తుంది. ఎంత తింటున్నామో తెలియకుండా తింటాం. దీనివల్ల బరువు పెరగడంతో పాటు కొవ్వు పేరుకుపోతుంది. ఈ అలవాటు ఉన్నవాళ్లకు టైప్ 2 మధుమేహం, అధిక రక్తపోటు, గుండె సమస్యలు వంటివి వస్తాయి. టీవీ చూస్తూ మెల్లగా తింటారు. ఆహారం సరిగ్గా నమలకపోతే జీర్ణం కాక అజీర్ణం, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా రాత్రిపూట టీవీ చూస్తూ తినడం వల్ల నిద్రకు కూడా ఆటంకం కలుగుతుంది. ఎప్పుడో ఒకసారి చూస్తే పర్లేదు. కానీ రోజూ ఇలా చేస్తే అనారోగ్య సమస్యలు తప్పవు. ఇండియాలో 10 నుంచి 12 శాతం పిల్లలు ఊబకాయంతో బాధపడుతున్నారు. దీనికి ముఖ్యం కారణం టీవీ, మొబైల్ చూస్తూ తినడమే.