Chicken Liver: చికెన్ లివర్ తింటున్నారా.. అయితే ఇవి మీరు తప్పక తెలుసుకోవాల్సిందే

చికెన్ లివర్ తింటే రక్తహీనత సమస్య తగ్గుతుంది. ఎందుకంటే ఇందులోని బీ 12 రక్తహీనతను కంట్రోల్ చేయడంలో లివర్ సాయపడుతుంది. అలాగే రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. రోజూ చికెన్ లివర్ తినడం వల్ల రక్తహీనత సమస్య తప్పకుండా తగ్గుతుంది.

Written By: Neelambaram, Updated On : August 23, 2024 8:01 pm

Chicken Liver

Follow us on

Chicken Liver: చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ చికెన్ ఇష్టంగా తింటారు. చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ అంటే రోజుకి ఎన్నిసార్లు ఫుడ్ తింటారో లెక్క ఉండదు. చికెన్‌ తినడం వల్ల శరీరానికి పోషకాలు అందుతాయి. అయితే ఈ చికెన్‌ను లిమిట్‌గా మాత్రమే తినాలి. ఎక్కువగా తింటే ఆరోగ్యానికి మంచిది కాదు. కొందరు చికెన్‌లో లెగ్ పీస్‌లు ఇష్టంగా తింటే మరికొందరు బోన్స్, లివర్ వంటివి తింటారు. అయితే ఇవి ఆరోగ్యానికి మంచిదని చాలామంది భావిస్తారు. వీటివల్ల ఆరోగ్య ప్రయోజనాలతో పాటు అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఇందులో ఐరన్, పొటాషియం, విటమిన్ బీ 12, కాపర్, ఎన్నో న్యూట్రిషన్లు ఉన్నాయి. ఆరోగ్యానికి మేలు చేస్తుందనే విషయం పక్కన పెడితే.. ఇష్టంతో మాత్రమే చికెన్‌ను ఎక్కువగా తీసుకుంటారు. అయితే చికెన్ లివర్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

చికెన్ లివర్ తింటే రక్తహీనత సమస్య తగ్గుతుంది. ఎందుకంటే ఇందులోని బీ 12 రక్తహీనతను కంట్రోల్ చేయడంలో లివర్ సాయపడుతుంది. అలాగే రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. రోజూ చికెన్ లివర్ తినడం వల్ల రక్తహీనత సమస్య తప్పకుండా తగ్గుతుంది. వీటితో పాటు సీజనల్ వ్యాధులు కూడా తగ్గుతాయి. ఇందులో ఉండే విటమిన్స్ వల్ల కంటి చూపు మెరుగుపడటంతో పాటు చర్మం కూడా బాగుంటుంది. అలాగే లివర్ హెల్త్‌కి ఈ చికెన్ లివర్ బాగా ఉపయోగపడతుంది. పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచడంతో పాటు లైంగిక ఇబ్బందుల నుంచి కాపాడుతుంది. సంతానోత్పత్తిని పెంచడంలో చికెన్ లివర్ బాగా సాయపడుతుంది. ఒత్తిడి, ఆందోళనతో ఉన్నవాళ్లు దీన్ని రోజూ తినడం వల్ల విముక్తి కలుగుతుంది. ఆరోగ్యానికి మంచిదని ఎక్కువగా వీటిని తీసుకోకూడదు. సరైన పద్ధతిలో మితంగా మాత్రమే తీసుకోవాలి. లేకపోతే సమస్యలు తప్పవు.

ఈ చికెన్ లివర్‌ను బాగా ఫ్రై చేసి డిష్‌గా తీసుకోవచ్చు. లేదా సూప్స్‌గా కూడా తయారు చేసి తాగవచ్చు. వీటిని ఏ విధంగా బాడీకి తీసుకున్న బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. అయితే ఎక్కువగా కొలెస్ట్రాల్ సమస్యలతో బాధ పడేవాళ్లు వీటికి దూరంగా ఉండటం మంచిది. అలాగే చికెన్ లివర్‌ను వండేటప్పుడు జాగ్రత్తగా వండాలి. లేకపోతే ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటి ఆహారం తినడం వల్ల బాడీలో టాక్సిన్స్ ఎక్కువగా పేరుకుపోతాయి. అందుకే చికెన్ లివర్‌ను వండేటప్పుడు చాలా నీట్‌గా క్లీన్ చేసి వండాలి. గర్భిణులు చికెన్ లివర్‌ను చాలా తక్కువ మోతాదులో మాతమే తీసుకోవాలి. లేకపోతే ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదముంది. చికెన్ లివర్‌తో ఎముకల ఆరోగ్యంగా కూడా ఉంటాయి. అలాగే బోలు ఎముకల వ్యాధిని తగ్గిస్తుంది. అన్నింటి కంటే మించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అయితే దీనిని చక్కగా వండుకుని మోతాదులో మాత్రమే తినాలి. అప్పుడే అందులోని పోషకాలు శరీరానికి అందుతాయి.