Brain Health: వీటి లోపం వల్ల మెదడు పనితీరు నెమ్మదిస్తుంది. ఫుల్ షార్ప్ గా కావాలంటే?

ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు చేప నూనెలో ఉంటాయి. ఇందులోని EPA, DHAలు మెదడు ఆరోగ్యానికి కీలకం. అవి కణ త్వచాలను నిర్మించడంలో సహాయపడతాయి. మెదడు కణాల మధ్య కమ్యూనికేషన్‌ను మెరుగుచేస్తాయి.

Written By: Swathi, Updated On : August 23, 2024 7:40 pm

Brain Health

Follow us on

Brain Health: మెదడు పనితీరు బాగుండాలన్నా.. ఒత్తిడి ఉండకూడదు అనుకున్నా పోషకాహారం తినాల్సిందే. అయితే మానసిక ఆరోగ్యాన్ని పెంచడంలో సప్లిమెంట్‌లు సహాయపడతాయి. కొన్ని సప్లిమెంట్లు సెరోటోనిన్, డోపమైన్ వంటి న్యూరోట్రాన్స్మిటర్ల ఉత్పత్తి, నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి మానసిక స్థితిని మెరుగుపరచడంలో, ఆందోళనను తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. పోషకాహార లోపం ఉండటం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. అందులో ఒకటి ఒత్తిడి సమస్య. ఈ ఒత్తిడిని తట్టుకునే శరీర సామర్థ్యాన్ని పెంపొందించడం కూడా చాలా అవసరం. అయితే మానసిక శ్రేయస్సును ప్రోత్సహించడంలో సప్లిమెంట్లు సమర్థవంతంగా పని చేస్తాయి. మరి మీ మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో ఓ సారి చూసేయండి.

1. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు
ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు చేప నూనెలో ఉంటాయి. ఇందులోని EPA, DHAలు మెదడు ఆరోగ్యానికి కీలకం. అవి కణ త్వచాలను నిర్మించడంలో సహాయపడతాయి. మెదడు కణాల మధ్య కమ్యూనికేషన్‌ను మెరుగుచేస్తాయి. ఒమేగా-3లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల డిప్రెషన్, యాంగ్జయిటీ లక్షణాలు తగ్గుతాయి అంటున్నారు నిపుణులు. సెరోటోనిన్, డోపమైన్ స్థాయిలను ప్రభావితం చేస్తాయి మానసిక స్థితిని నియంత్రించే న్యూరోట్రాన్స్‌మిటర్లు.

2. విటమిన్ డి
విటమిన్ డి కావాల్సినంత శరీరంలో ఉండాల్సిందే. దీన్ని “సన్‌షైన్ విటమిన్” అని కూడా పిలుస్తారు, మానసిక స్థితి నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్ డి తక్కువ ఉంటే కాలానుగుణ ప్రభావిత రుగ్మత, డిప్రెషన్‌ వంటి సమస్యలు వస్తాయి. ఈ విటమిన్ డి మెదడు మానసిక స్థితి, సామాజిక ప్రవర్తనను ప్రభావితం చేసే సెరోటోనిన్ వంటి న్యూరోట్రాన్స్‌మిటర్‌లను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా, విటమిన్ డి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడం, ఎముకల ఆరోగ్యానికి బలాన్ని అందించడంలో సహాయం చేస్తుంది. ఈ విటమిన్ మల్టిపుల్ స్క్లెరోసిస్ ప్రమాదాన్ని తగ్గించడం ద్వారా మొత్తం ఆరోగ్యాన్ని పెంచుతుంది.

3. మెగ్నీషియం
మెగ్నీషియం మెదడు పనితీరు, మానసిక స్థితి నియంత్రణకు అవసరం. GABA (గామా-అమినోబ్యూట్రిక్ యాసిడ్) వంటి న్యూరోట్రాన్స్మిటర్లను నియంత్రించడం ద్వారా నాడీ వ్యవస్థకు హాయపడుతుంది. మెగ్నీషియం లోపం పెరిగితే ఆందోళన, నిరాశ, నిద్రకు ఆటంకం వంటి సమస్యలు వస్తాయి. మెగ్నీషియం ఒత్తిడిని తగ్గిస్తుంది. మెరుగైన నిద్రను ప్రోత్సహిస్తుంది. ఇది కండరాల పనితీరుకు సహాయం చేస్తుంది. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

4. బి విటమిన్లు
B విటమిన్లు (B6, B9, B12) మెదడు ఆరోగ్యానికి సహాయం చేస్తాయి. విటమిన్ B6 మానసిక స్థితిని నియంత్రించే సెరోటోనిన్, డోపమైన్ వంటి న్యూరోట్రాన్స్‌మిటర్‌ల ఉత్పత్తిలో సహాయపడుతుంది. విటమిన్ B9 (ఫోలేట్) మెదడు అభివృద్ధికి , DNA, RNA సంశ్లేషణకు అవసరం. విటమిన్ B12 నరాల పనితీరు, ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయం చేస్తుంది. ఈ విటమిన్లలో లోపాలు ఉంటే నిరాశ, అలసటకు దారితీస్తాయి. B విటమిన్ల వల్ల మానసిక స్థితిని మెరుగుపడుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. అంతేకాదు గుండె ఆరోగ్యానికి కూడా అవసరమే ఈ విటమిన్లు.