https://oktelugu.com/

Hair color : జుట్టుకు రంగు వేస్తున్నారా.. అయితే ముందు ఈ విషయాలు తెలుసుకోండి

జుట్టుకు రంగు వేసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్యార్ టెస్ట్ చేసుకున్న తర్వాతే కురులకు రంగు వేయాలి. దీనికోసం ముందే చేతి మీద రంగు రాసి పదినిమిషాలు చూడాలి. ఎలాంటి ఎఫెక్ట్ చూపించకపోతే జుట్టుకు వేసుకోవచ్చు. జుట్టుకు వాడే రంగుల్లో అమ్మోనియా, ప్రోస్టియన్, గ్లైకోల్, పిపిడి వంటి రసాయనాలు ఉన్నాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : August 15, 2024 / 02:19 AM IST

    Hair Color

    Follow us on

    Hair color : ఈ ప్యాషన్ ప్రపంచంలో స్టైలిష్‌గా ఉండాలని చాలామంది జుట్టుకు కలర్ వేస్తారు. కానీ కొంతమంది వాళ్ల తెల్లజుట్టును దాచిపెట్టుకోవడానికి కలర్ వేస్తారు. జుట్టు నల్లగా ఉండటం కంటే డిఫరెంట్‌గా కలర్‌లో ఉండటానికే ఇష్టపడుతున్నారు. ట్రెండ్ మారేకొద్ది యువత కూడా కొత్త కొత్త ఫ్యాషన్ ఫాలో అవుతున్నారు. జుట్టుకు కలర్ వేయడం చేసి బ్యూటీ పార్లర్‌కు వెళ్తుంటారు. అయితే జుట్టుకు కలర్ వేయడం అందంగా కనిపించవచ్చు. కానీ ఈ రంగుల వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయట. ఈ కలర్స్‌లో ఉండే రసాయనాల వల్ల జుట్టు దెబ్బతింటుందని తెలిసిన రంగు వేయడానికే ఇష్టం చూపిస్తున్నారు. మరి మీరు కూడా జుట్టుకు రంగు వేసుకుంటున్నారా.. అయితే ఈ విషయాలు ముందు తెలుసుకోండి.

    జుట్టుకు రంగు వేసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్యార్ టెస్ట్ చేసుకున్న తర్వాతే కురులకు రంగు వేయాలి. దీనికోసం ముందే చేతి మీద రంగు రాసి పదినిమిషాలు చూడాలి. ఎలాంటి ఎఫెక్ట్ చూపించకపోతే జుట్టుకు వేసుకోవచ్చు. జుట్టుకు వాడే రంగుల్లో అమ్మోనియా, ప్రోస్టియన్, గ్లైకోల్, పిపిడి వంటి రసాయనాలు ఉన్నాయి. వీటివల్ల అలర్జీలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ రసాయనాలు చర్మానికి తగలడం వల్ల జుట్టు కుదుళ్ల నుంచి దెబ్బతింటుంది. జుట్టు పొడిబారిపోయి, బలహీనపడుతుంది. రంగు కళ్లలోకి పోకుండా జాగ్రత్త వహించాలి. ఇందులోని రసాయనాల వల్ల కళ్లు పోయే ప్రమాదం కూడా ఉంది.

    జుట్టుకు వేసే రంగును కేవలం లిమిట్‌ మాత్రమే వేసుకోవాలి. ఎక్కువగా వేసుకుంటే క్యాన్సర్, ఆస్తమా వచ్చే ముప్పు ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందులోని రసాయనాల వల్ల అలర్జీలు, చర్మ సంబంధిత సమస్యలు, జుట్టు బలహీన పడటం, విపరీతమైన తలనొప్పి వంటివి వస్తాయి. జుట్టుకు రంగు వేసిన రోజే షాంపూతో తలస్నానం చేయవద్దు. తర్వాత రోజు తలస్నానం చేయండి. ఎక్కువసార్లు తలస్నానం చేయకుండా వారానికి రెండు సార్లు మాత్రమే తలస్నానం చేసేలా ప్లాన్ చేసుకోండి. అలాగే వాటర్‌లో క్లోరిన్ లేనట్లు చూసుకోండి. లేదంటే కలర్స్‌లోని రసాయనాలు, క్లోరిన్ తలస్నానం చేసినప్పుడు రెండు కలిసి జుట్టును వేరే రంగులోకి మార్చేస్తుంది. జుట్టుకు రంగు వేసుకున్న తర్వాత వేడినీటితో అసలు స్నానం చేయకూడదు. అవసరమైతే గోరువెచ్చని నీటితో చేయవచ్చు. కానీ చల్లనినీటితోనే తలస్నానం చేయడానికి ప్రయత్నించండి.

    జుట్టుకు ఇలాంటి రంగులు వేసుకోవడం కంటే సహజ పద్ధతుల్లో రంగు వేసుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవు. హెన్నా, గోరింటాకు వంటివి అప్లై చేయడం వల్ల జుట్టు పాడవుకుండా ఉంటుంది. రసాయనాలు ఉండే రంగును తలకి వేయడం వల్ల అది కొన్ని రోజులే ఉంటుంది. ఈ కెమికల్స్‌కి మీరు వాడే కెమికల్ షాంపూల వల్ల వ్యతిరేకత చూపిస్తుంది. కాబట్టి తలకు రంగు అప్లై చేసిన తర్వాత రసాయనాలు ఉండే షాంపూలు వాడకపోవడం మంచిది. జుట్టుకు రంగు వేసుకునే రెండు రోజుల ముందు మంచి కండీషనర్‌తో తలస్నానం చేయండి. దీనివల్ల జుట్టుకు కలర్ బాగా పడుతుంది. రంగు కూడా త్వరగా పోయే అవకాశం తక్కువగా ఉంటుంది.