Tea : పరిగడుపున టీ తాగుతున్నారా..? అయితే ఒక్కసారి ఇది తెలుసుకోండి..

Tea : ఉదయం లేవగానే చాలా మందికి టీ తాగనిదే దినచర్య మొదలు కాదు. టీ లో ఉండే పదార్థాలతో మెదడును ఉత్తేజపరుస్తుంది. మనసును ఉల్లాసపరుస్తుంది. ఒత్తిడికి లోనయ్యేవారు కప్పు టీ తాగడం వల్ల రిలీఫ్ అవుతారు. ఈ ఉపయోగాలు ఉండడంతో కొంత మంది బ్రష్ చేసుకోకుండానే టీ లేదా కాఫీ తాగడం అలవాటు చేసుకున్నారు. దీనినే బెడ్ కాఫీ అంటారు. బెడ్ కాఫీ తాగడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటామని అనుకుంటారు. కానీ ఇలా చేయడం […]

Written By: Chai Muchhata, Updated On : April 7, 2023 1:15 pm
Follow us on

Tea : ఉదయం లేవగానే చాలా మందికి టీ తాగనిదే దినచర్య మొదలు కాదు. టీ లో ఉండే పదార్థాలతో మెదడును ఉత్తేజపరుస్తుంది. మనసును ఉల్లాసపరుస్తుంది. ఒత్తిడికి లోనయ్యేవారు కప్పు టీ తాగడం వల్ల రిలీఫ్ అవుతారు. ఈ ఉపయోగాలు ఉండడంతో కొంత మంది బ్రష్ చేసుకోకుండానే టీ లేదా కాఫీ తాగడం అలవాటు చేసుకున్నారు. దీనినే బెడ్ కాఫీ అంటారు. బెడ్ కాఫీ తాగడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటామని అనుకుంటారు. కానీ ఇలా చేయడం వల్ల లాభాల కంటే ఆరోగ్య సమస్యలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు. మరి బెడ్ కాఫీ వల్ల జరిగే నష్టాలేంటో తెలుసుకుందాం..

పొద్దున్నే లేచిన తరువాత ఏమీ తీసుకోకుండా టీ తాగడం వల్ల ఎసిడిటీ, గుండెల్లో మంట, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయని అంటున్నారు. అవి క్రమంగా దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీస్తాయని తెలుపుతున్నారు. ఏదైనా మొతాదు మించితే విషమే.. అలాగే టీ అవసరమున్నంత వరకు తాగితే పర్వాలేదు. కానీ అతిగా తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అయితే పరిగడుపు ఒక్క కప్పు తాగిన అనేక వ్యాధులకు గురవుతారని అంటున్నారు. టీ లేదా కాఫీలో ఆమ్లం అనే పదార్థం ఉంటుంది. సహజంగానే మన శరీరంలో ఆమ్లం ఉంటుంది. పరిగడుపున టీ తాగడం వల్ల ఇది పరిమాణం పెరిగి ఎసీడిటీకి దారి తీస్తుంది. అలాగే నోటిలోని బ్యాక్టిరియా షుగర్ లెవల్స్ ను పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల డీ హైడ్రేైషన్ కు గురయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు. టీలో ఉండే పదార్థాలు శరీరంలో మూత్ర స్థాయిని పెంచుతుంది. దీనివల్ల శరీరంలోని నీరంతా బయటకు పోతుంది. ఇది నిర్జిలీకరణ సమస్యకు దారి తీసి అనారోగ్య సమస్యలు మొదలవుతాయి. బెడ్ కాఫీ తాగడం వల్ల ఈ సమస్య కచ్చితంగా వస్తుందని అంటున్నారు.

పరిగడపు టీ జీర్ణక్రియను క్షీణిస్తుంది. జీర్ణ వ్యవస్థ దెబ్బతినడం వల్ల శరీరానికి శక్తి అందుతుంది. దీంతో ఎప్పుడూ అలసిపోయినట్లు కనిపిస్తారు. ఇలాంటి సమయంలో జ్వరం తదితర వ్యాధులు వచ్చే సమస్యలు ఎక్కువ. టీ అతిగా తాగడం వల్ల మలబద్ధకం ఏర్పడుతుంది. టీ తాగిన కొన్ని నిమిషాలు బాగానే ఉంటుంది. ఆ తరువాత నిద్రలేమి సమస్య తయారువుతుంది. దీంతో బరువు పెరగడం, ఆకలి మందగించడం, రక్తపోటు సమస్యలు వస్తాయి.

మరి టీ ని మొత్తానికి అవైడ్ చేయాలా? అంటే అలా చేయాల్సిన పనిలేదు. మొతాదుకు మించి తీసుకోవడంతో పాటు టీ తో పాటు బిస్కట్లు తీసుకోవడం వల్ల ఉపశమనం ఉంటుంది. అలాగే ఆహారం తిన్న తరువాత రెండు లేదా మూడు గంటల తరువాత టీ తాగడం మంచిది. ఎక్కువగా టీ తీసుకోవడం వల్ల డీ హైడ్రేషన్ తో పాటు కడుపునొప్పి, ఎసిడీటీ సమస్యలు వస్తాయి. అందువల్ల పరిగడుపున టీ కి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి.

Tags