https://oktelugu.com/

Infertility: మద్యం సేవిస్తున్నారా.. అయితే మీకు పిల్లల పుట్టడం కష్టమే! శృంగార సామర్థ్యమూ తగ్గిపోతుందట

ఈరోజుల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా మద్యం తాగడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. లైఫ్‌ని ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో కూడా కొందరు తాగుతున్నారు. అయితే మహిళలు మద్యం సేవించడం వల్ల ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లపై ప్రభావం చూపుతుంది.

Written By:
  • Neelambaram
  • , Updated On : August 30, 2024 / 08:47 AM IST

    Infertility

    Follow us on

    Infertility: మద్యం సేవించే ఆచారం పాశ్చాత్య దేశాల నుంచి ఇండియాకు వచ్చింది. అప్పుడు కేవలం పురుషులు మాత్రమే మద్యం తీసుకునేవాళ్లు. కానీ ప్రస్తుతం ఆడ, మగ తేడా లేకుండా అందరూ మద్యం తీసుకుంటున్నారు. అసలు పురుషుల కంటే మహిళలే ఎక్కువగా మద్యపానాన్ని సేవిస్తున్నారు. ఒత్తిడి, ఆఫీస్ పని, కుటుంబ పని, వ్యక్తిగత కారణాలు, ఆందోళన వల్ల ఈరోజుల్లో చాలామంది మహిళలు ఎక్కువగా మద్యం సేవిస్తున్నారు. సాధారణంగానే మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ఈ విషయం తెలిసిన కూడా మారిన జీవనశైలి వల్ల మద్యం తాగుతున్నారు. అయితే మహిళలు మద్యం ఎక్కువగా తాగితే పిల్లలు పుట్టరని చాలామంది మహిళలు సందేహ పడుతున్నారు. మహిళలు మద్యపానం తీసుకోవడం వల్ల పుట్టే పిల్లలపై ప్రభావం పడుతుందా? ఇందులో నిజమెంత తెలియాలంటే ఆర్టికల్ చదివేయండి.

    ఈరోజుల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా మద్యం తాగడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. లైఫ్‌ని ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో కూడా కొందరు తాగుతున్నారు. అయితే మహిళలు మద్యం సేవించడం వల్ల ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లపై ప్రభావం చూపుతుంది. ఇవి ఉత్పత్తి కావడం తగ్గిపోతాయి. అలాగే మహిళల్లో గర్భధారణ సామర్థ్యాన్ని కూడా తగ్గిస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొంతమంది వారానికి ఒకటి లేదా రెండు సార్లు తాగుతారు. ఇలాంటి వాళ్లకి పెద్ద ప్రభావం ఏం చూపదు. కానీ వారానికి ఎక్కువ సార్లు మద్యం సేవించే వాళ్లలో మాత్రం పిల్లలు పుట్టడం కష్టం అవుతుంది. కొందరు వారానికి 6-14సార్లు మద్యం సేవిస్తారు. ఇలాంటి మహిళల్లో 25శాతం వరకు సంతాన సామర్థ్యం తగ్గుతుందని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. ఈ ఆల్కహాల్ అండం ఉత్పత్తిపై కూడా ప్రభావం చూపుతుంది.

    ముఖ్యంగా నెలసరి సమస్యల్లో బాగా ఇబ్బందులు వస్తాయి. దీని వల్ల గర్భం దాల్చడం కూడా కష్టమవుతుంది. కొంతమంది గర్భం దాల్చిన కూడా కూడా కొన్నిసార్లు అబార్షన్ అయ్యే ప్రమాదం ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటితో పాటు ఎండోమెట్రియాసిస్ అనే వ్యాధి కూడా మహిళలకు కడుపులో వస్తుంది. దీనివల్ల సంతాన సమస్యలు వస్తాయని వైద్యులు అంటున్నారు. అలాగే పురుషులు ఎక్కువగా మద్యం తాగిన స్పెర్ప్ కౌంట్ తగ్గిపోతుంది. పురుషులు ఎక్కువగా మద్యం సేవించి శృంగారంలో పాల్గొంటారు. దీనివల్ల పురుషుల్లో టెస్టోస్టెరాన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. కేవలం మహిళల్లో మాత్రమే కాకుండా పురుషుల్లో కూడా సంతానలేమి సమస్య వస్తుంది. ఎక్కువగా తాగడం వల్ల పురుషాంగం కుంచించుకు పోతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మహిళలతో పాటు పురుషులు కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్పెర్మ్ కౌంట్ పెరిగేలా ఆహార పదార్థాలు తినాలి. వ్యాయామం చేయాలి. అప్పుడే స్పెర్మ్ నాణ్యతగా ఉంటుంది. దీనివల్ల పిల్లలు తొందరగా పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి వీలైనంత వరకు మద్యానికి దూరంగా ఉండటం మేలు.