https://oktelugu.com/

Wolves: తోడేళ్ల కథ : మనుషుల కంటే తోడేలు స్నేహం మిన్న.. అవి నమ్మితే ప్రాణం పెట్టేస్తాయి..

ఇతర జంతువులతో పోలిస్తే తోడేలు చాలా ప్రత్యేకమైనది. దీనికి వాసన చూసే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. తనని నమ్మి ఎవరైనా ఉంటే వాళ్లను అస్సలు ఒంటరిగా వదలదు. ఎక్కడికి వెళ్లిన తీసుకు వెళ్తుంది.

Written By:
  • Neelambaram
  • , Updated On : August 30, 2024 8:39 am
    Wolves

    Wolves

    Follow us on

    Wolves: ఈ భూమి మీద ఉండే ప్రతి జీవరాశికి ఫ్రెండ్స్ తప్పకుండా ఉంటారు. మనుషులు స్నేహాన్ని గౌరవిస్తారు, నమ్ముతారు. కానీ ప్రాణం పెట్టి మరి స్నేహితులను నమ్మరు. అయితే జంతువుల్లో తోడేలు మాత్రం స్నేహితులను నమ్మితే బలంగా ప్రాణాలు పెడతాయి. ఇతర జంతువులతో పోలిస్తే తోడేలు స్నేహితులతో నమ్మకంగా ఉంటాయి. అయితే వీటిని పట్టుకోవడం కూడా కష్టం. వేటగాళ్లు లేదా ఎవరైనా వీటిని పట్టుకోవాలంటే ఎన్నో ప్లాన్‌లు వేస్తేనే సాధ్యం అవుతుంది. అప్పటికీ కూడా పట్టుకోవడం కష్టమే. అయితే ఈ తోడేళ్లు ఎక్కువగా పిల్లల వెంట పడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి పిల్లలను ఎందుకు వేటాడుతాయి? తోడేలును పట్టుకోవడం ఎందుకంత కష్టం? పూర్తి వివరాల్లో తెలుసుకుందాం.

    వాసన సామర్థ్యం ఎక్కువే
    ఇతర జంతువులతో పోలిస్తే తోడేలు చాలా ప్రత్యేకమైనది. దీనికి వాసన చూసే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. తనని నమ్మి ఎవరైనా ఉంటే వాళ్లను అస్సలు ఒంటరిగా వదలదు. ఎక్కడికి వెళ్లిన తీసుకు వెళ్తుంది. సాధారణంగా తోడేళ్లు అడవిలో వేటకు వెళ్తుంటాయి. తనతో ఎవర్ని అయిన తీసుకు వెళ్తే వాళ్లకు హాని కలిగేలా చేయదు. వీటికి ఉన్న వాసన సామర్ధ్యం వల్ల సహచరులను కాపాడుతుంది. వీటిని పట్టుకోవడం చాలా కష్టం. మిగతా జంతువుల కంటే తోడేలు తెలివిగా ఉంటాయి. మనుషులు కంటే తోడేళ్లు బెటర్. స్నేహితులను ప్రాణం పెట్టి కాపాడుకుంటాయి. వృద్దాప్యం వచ్చినంత వరకు వాటికి తోడుగా ఉంటాయి. అలాగే వయస్సు పెరిగిన తోడేలు.. కొత్త తోడేలుకు ఎలా వేటాడాలి అన్ని నేర్పిస్తాయి.

    పిల్లలనే వెంటే ఎందుకు పడతాయి?
    తోడేలు ఎక్కువగా వృద్ధుల కంటే పిల్లల వెంట పడతాయి. కొందరు పిల్లలు తోడేళ్లను చూసి దగ్గరకు వెళ్లి వాటితో ఆడుకుంటారు. ఇలా తోడేళ్లు వాటితో కొంతసేపు ఆడుతాయి. అవి ఎలాంటి దాడి చేయవు. కానీ అవి తమ ఆకలిని తీర్చుకోవడానికి మాత్రమే ఇలా చేస్తుంది. పిల్లలను బెదిరించదు, కాటు వేయదు. పిల్లలు తోడేలుకు ఈజీగా దొరికే ఫుడ్ అని చెప్పుకోవచ్చు. ఇవి ఎక్కడ ఉంటే అక్కడ చిన్న పిల్లలు మరణాలు పెరుగుతున్నాయి. తోడేళ్లు అన్ని కలిసి వేటకు వెళ్తాయి. ఇవి వాటి బాడీ లాంగ్వేజ్, వాసనతో అనేక పద్ధతులను ఉపయోగించి వేటను కొనసాగిస్తాయి. తోడేలు దంతాలు తెరిచి ఉంచి, ముఖం ముందుకు విస్తరిస్తే బెదిరింపు సందేశాన్ని పంపుతాయి. తోడేలు ఎప్పుడైనా దాడి చేస్తే వాటిని తరిమి కొట్టేందుకు గాలి కొమ్ములు లేదా శబ్ధం చేసే వస్తువులను ఉపయోగించాలి. తోడేలుకు మనిషి వీపు అసలు చూపించకూడదు. కనిపిస్తే వాటికి వీపు కనిపించకుండా నడవాలని నిపుణులు అంటున్నారు. అలాగే దగ్గరలో చెట్టు ఉంటే ఎక్కాలి. తోడేళ్లు చెట్లు ఎక్కలేవు. ఇలా చేస్తే తోడేళ్లు నుంచి తప్పించుకోవచ్చు.