https://oktelugu.com/

Non Stick Pan: నాన్ స్టిక్ ప్యాన్ లో ఈ ఆహార పదార్థాలను వండుతున్నారా.. జాగ్రత్త ఆరోగ్య సమస్యలు తప్పవు!

Non Stick Pan: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క వంటింట్లో నూ తప్పనిసరిగా నాన్ స్టిక్ ప్యాన్స్ మనకు దర్శనం ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే మనం ప్రతి ఒక్క వంటలను కూడా ఇలాంటి నాన్ స్టిక్ ప్యాన్స్ లో వండుతున్నాము. అయితే ఎక్కువగా వంటలను నాన్ స్టిక్ ప్యాన్స్ లో వండుకొని తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని రకాల ఆహార పదార్థాలను పొరపాటున కూడా ఇలాంటి వాటిలో వండుకొని […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : April 6, 2022 / 12:23 PM IST
    Follow us on

    Non Stick Pan: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క వంటింట్లో నూ తప్పనిసరిగా నాన్ స్టిక్ ప్యాన్స్ మనకు దర్శనం ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే మనం ప్రతి ఒక్క వంటలను కూడా ఇలాంటి నాన్ స్టిక్ ప్యాన్స్ లో వండుతున్నాము. అయితే ఎక్కువగా వంటలను నాన్ స్టిక్ ప్యాన్స్ లో వండుకొని తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని రకాల ఆహార పదార్థాలను పొరపాటున కూడా ఇలాంటి వాటిలో వండుకొని తినకూడదు. మరి ఎలాంటి ఆహార పదార్థాలను నాన్ స్టిక్ ప్యాన్స్ లో వండుకొని తినకూడదు అనే విషయానికి వస్తే…

    సాధారణంగా మనం అధిక వేడి పై ఉడికించి తయారు చేసుకునే వంటలను ఇలాంటి నాన్ స్టిక్ ప్యాన్స్ పై తయారుచేసుకుని తినకూడదు. ఇలా అధిక వేడిని కలిగించి వంటలను తయారు చేయటం వల్ల నాన్ స్టిక్ ప్యాన్స్ పై ఉన్నటువంటి ఎనామిల్ కరిగి మనం తినే ఆహార పదార్థాలలో కలుస్తుంది. ఈ క్రమంలోనే ఈ విధమైనటువంటి ఆహార పదార్థాలు తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని అందుకే అధిక మంటపై తయారు చేసే ఆహార పదార్థాలను తినకూడదు అని నిపుణులు వెల్లడించారు.

    ముఖ్యంగా చికెన్, సూప్, పాయసం, ఇతర మసాలా కూరలను ఎక్కువ వేడి వద్ద తయారు చేసుకొని తినడం వల్ల నాన్ స్టిక్ ప్యాన్ పై ఉండే ఎనామిల్ కరిగి అందులో ఉన్న రసాయనాలు ఆహార పదార్థంలో కలుస్తాయి. అందుకే వీలైనంత వరకు ఎలాంటి ఆహార పదార్థాలను
    నాన్ స్టిక్ ప్యాన్స్ పై చేయకుండా సాధారణ పాత్రలను ఉపయోగించి చేసుకొని తినటం ఎంతో ఉత్తమం.నాన్ స్టిక్ ప్యాన్స్ పై ఎల్లప్పుడు తక్కువ మంటతో తయారయ్యే ఆహార పదార్థాలను మాత్రమే చేసుకొని తినాలి.