Danger zone : మధుమేహం లక్షణాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీని వల్ల వ్యాధిని త్వరగానే నియంత్రించడం తేలిక అవుతుంది. నిర్లక్ష్యం వహిస్తే అది ప్రాణాంతకం కూడా కావచ్చు. వ్యాధిని నయం చేయడం కూడా కష్టం కావచ్చు అంటున్నారు నిపుణులు. అందుకే ముందుగా ఈ వ్యాధి లక్షణాలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.
తరచూ మూత్ర విసర్జన: మూత్ర విసర్జన కోసం రాత్రిపూట తరచుగా మేల్కుంటారు. మధుమేహం సాధారణ లక్షణాలలో ఇది ఒకటి. ఇదొక్కటే కాదు మరిన్ని లక్షణాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. వాటి గురించి కూడా తెలుసుకుందాం. వీటి వల్ల కూడా మీరు కాస్త ప్రశాంతంగా ఉండవచ్చు.
అధిక దాహం : అధిక దాహం లేదా పాలీడిప్సియా ఉంటుంది. అంటే 6 లీటర్లు లేదా అంతకంటే ఎక్కువ నీరు తాగాలి అనిపించడం. ఇలా ఉన్నా కూడా శరీరంలో అదనపు చక్కెరను సూచిస్తుంది అంటున్నారు నిపుణులు.
తీవ్రమైన అలసట: మీరు రాత్రిపూట విపరీతంగా అలసిపోయినట్లు అనిపిస్తే, శరీరం గ్లూకోజ్‌ని సరిగ్గా ఉపయోగించుకోదని అర్థం.. ఇది చక్కెర హెచ్చుతగ్గులకు లోనవుతుందనడానికి సంకేతం.
అస్పష్టమైన కంటి చూపు: శరీరంలో షుగర్ ఎక్కువగా ఉంటే కళ్లలోని లెన్స్‌లు తరచుగా వాచిపోయి కొన్నిసార్లు చూపు కూడా అస్పష్టంగా మారుతుంది.
అనుకోకుండా బరువు తగ్గడం: అనుకోకుండా అధిక బరువు తగ్గడం మధుమేహాన్ని సూచిస్తుంది అంటున్నారు నిపుణులు. కొందరు సడన్ గా బరువు తగ్గినప్పుడు ఆందోళన చెందుతారు. ఈ విషయంలో కాస్త జాగ్రత్త వహించాల్సిందే.
గాయాలు మానకపోవడం: అధిక షుగర్ సమస్య ప్రధాన లక్షణాలలో ఒకటిగా పరిగణిస్తారు వైద్యులు.. శరీరంలో ఏర్పడిన చిన్న గాయం కూడా త్వరగా మానకుండా ఇబ్బంది పెడుతుంటుంది.
ఇంకా ఆకలి పెరగడం, తరచుగా ఇన్ఫెక్షన్లు, శరీరంలో జలదరింపు లేదా తిమ్మిరి, చర్మంపై నల్లటి మచ్చలు ఏర్పడటం కూడా డయాబెటిస్ లక్షణాలేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ లక్షణాలు ఉంటే మాత్రం వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.