raisin water : చాలా మందికి డ్రై ఫ్రూట్స్ అంటే నచ్చవు. కానీ కొందరు మాత్రం చాలా ఇష్టంగా తింటారు. ఈ డ్రై ఫ్రూట్స్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. బాదం, కిస్మిస్, పిస్తా ఇలా ఎన్నో రకాల డ్రై ఫ్రూట్స్ లతో మీరు శరీరానికి కావాల్సిన చాలా ప్రోటీన్, విటమిన్ లను పొందవచ్చు. వీటిలో కొన్నింటిని డైరెక్ట్ గా తినడం కంటే నానబెట్టి తినడం వల్ల మరింత ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. బాదాన్ని కూడా డైరెక్ట్ గా తినడం కంటే నానబెట్టి తినడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు. అదేవిధంగా ఎండు ద్రాక్షను కూడా మంచి ప్రయోజనాలను అందిస్తుంది. అవును ఇంతకీ మీరు దీన్ని ఇష్టంగా తింటారా? అయితే కాస్త వాటర్ లో నానబెట్టి తినండి. ఎందుకో తెలుసా? రుచికి తియ్యగా, కాస్త పుల్లగా ఉంటాయి కిస్మిస్. ఎండు ద్రాక్ష (Raisins) అంటే చాలా మందికి చాలా ఇష్టం కూడా. అయితే, ఇవి ఆరోగ్యానికి చాలా మేలు కూడా చేస్తాయి అంటున్నారు నిపుణులు ఆరోగ్యాన్ని పెంపొందించే అనేక ఔషధ పోషక పదార్థాలు దీనిలో ఉంటాయి. మరి దీన్ని ఎలా తినాలో తెలుసా?
ఎండుద్రాక్షను రాత్రంతా నీటిలో నానబెట్టి, మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తీసుకుంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. ఎండుద్రాక్ష నీరు వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందట. మెరుగైన జీర్ణక్రియకు కూడా ఇది తోడ్పడుతుంది. ఎండుద్రాక్షలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది సాధారణ ప్రేగు కదలికలను ప్రోత్సహించడం, మలబద్ధకాన్ని నివారించడం ద్వారా జీర్ణ ప్రక్రియలో సహాయపడుతుంది. నిర్విషీకరణకు తోడ్పడుతుంది ఎండుద్రాక్షనీరు. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు, సహజ సమ్మేళనాలు హానికరమైన టాక్సిన్‌లను తొలగించడం ద్వారా కాలేయాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడతాయి.
రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది కూడా. ఎండుద్రాక్షలో విటమిన్ సి, బి-కాంప్లెక్స్ విటమిన్లు వంటి ముఖ్యమైన విటమిన్లు ఉంటాయి. అలాగే ఫినాలిక్ సమ్మేళనాలు వంటి యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. మెరుగైన గుండె ఆరోగ్యం కూడా మీ సొంతం అవుతుంది. ఎండుద్రాక్షలో పొటాషియం అధికంగా ఉంటుంది. సోడియం స్థాయిలను సమతుల్యం చేస్తూ రక్తపోటును నియంత్రిస్తుంది. ఇక ఈ ఎండుద్రాక్ష నీరు ఇనుము ను కూడా పెంచుతుంది. ఎందుకంటే ఎండుద్రాక్ష ఇనుముకు మంచి మూలం, ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి కీలకంగా మారుతుంది.
ఎముకల ఆరోగ్యం కూడా మెరుగు అవుతుంది. ఎండుద్రాక్షలో కాల్షియం, బోరాన్ ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి, బలానికి తోడ్పడుతాయి. మెరుగైన చర్మ ఆరోగ్యానికి కూడా తోడ్పడుతాయి. ఎండుద్రాక్షలోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి చర్మాన్ని రక్షించడంలో సహాయపడతాయి. బరువు నిర్వహణకు తోడ్పడుతాయి. ఎండుద్రాక్షలోని డైటరీ ఫైబర్ సంతృప్తిని ప్రోత్సహిస్తుంది. మొత్తం కేలరీల తీసుకోవడం తగ్గిస్తుంది కూడా.