Triple R : తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి ని మించిన దర్శకుడు మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఆయనను చాలా గొప్పగా చూపిస్తున్నాయి. మరి ఆయన చేసిన ప్రతి ప్రయత్నం ఇప్పటివరకు సూపర్ సక్సెస్ గా నిలవడమే కాకుండా ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టాయి…ఇక ఇప్పుడు చేయబోయే ప్రయత్నం తో ఆయన ఎలాంటి విజయాన్ని సాధిస్తాడు అనేది తెలియాల్సి ఉంది…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది దర్శకులు వాళ్ళని వాళ్ళు స్టార్లు డైరెక్టర్స్ గా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అయితే రాజమౌళి లాంటి దర్శకుడు మాత్రం తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే కాకుండా ఆయన కంటూ ఒక భారీ గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు. మరి ఇలాంటి రాజమౌళి తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే కాకుండా ఆయన చేస్తున్న ప్రతి సినిమా విషయంలో కూడా ఆచితూచి ముందుకు సాగుతూ ఉంటాడు. అయితే ‘త్రిబుల్ ఆర్’ సినిమా విషయానికి వస్తే ఇద్దరు హీరోలను పెట్టి చేసిన ఈ సినిమా భారీ ఇండస్ట్రీ హిట్ ను దక్కించుకుంటుంది అంటూ చాలామంది ఆశా భావాన్ని వ్యక్తం చేశారు. కానీ ఈ సినిమా మాత్రం కేవలం 1300 కోట్ల కలెక్షన్లను మాత్రమే రాబట్టి పెద్దగా సక్సెస్ అయితే సాధించలేక పోయింది. నిజానికి బాహుబలి సినిమాతో ప్రభాస్ ఒక్కడు క్రియేట్ చేసిన పెను ప్రభంజనాన్ని ఇద్దరు హీరోలు కలిసి దాటలేకపోవడం అనేది నిజంగా చాలా బ్యాడ్ లక్ అనే చెప్పాలి.
నిజానికి ఈ సినిమా బాహుబలి రికార్డ్ ను ఎందుకు బ్రేక్ చేయలేకపోయింది అంటే ఈ సినిమాలో విలనిజం అనేది కరెక్ట్ గా పండలేదు. అసలు క్లారిటీ లేని విలనిజం వల్లే ఈ సినిమా అంత పెద్దగా ఆడలేదనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది. మరి మొత్తానికైతే ఈ సినిమా ద్వారా రాజమౌళి మరొక మెట్టు పైకి ఎక్కుతాడు అనుకుంటే అలాంటిదేమీ జరగలేదు.
ఇద్దరు హీరోలను పెట్టినప్పుడు ఈ సినిమా భారీ విజయాన్ని సాధించాల్సిన అవసరమైతే ఉంది. ఎందుకంటే ఇద్దరు హీరోల అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూశారు. ఇక వాళ్ళనే కాకుండా ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క అభిమాని కూడా ఈ సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించబోతున్నారు అంటూ వ్యాఖ్యలైతే చేశారు. కానీ అవేవి జరగకపోగా ఈ సినిమా వల్ల రాజమౌళికి పెద్దగా ఒరిగిందయితే ఏమీ లేదనే చెప్పాలి. అందుకే ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న సినిమాతో భారీ సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు…
ఇక 1300 కోట్ల కలెక్షన్స్ తో తెరకెక్కనున్న ఈ సినిమా 3000 కోట్లకు పైన కలెక్షన్లు రాబడుతుందంటూ భారీ అంచనాలైతే పెట్టుకున్నారు… మరి ఈ సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టిస్తే తెలుగు సినిమా స్థాయి ని హాలీవుడ్ రేంజ్ కి తీసుకెళ్లిన వాడు అవుతాడు లేకపోతే మాత్రం మన సినిమా స్థాయి అనేది ఇక్కడే ఉండిపోతుంది…