దేశంలోని కోట్ల సంఖ్యలో ప్రజలు కరోనా వ్యాక్సిన్ ను వేయించుకున్నారు. అయితే కొంతమంది వ్యక్తులు మాత్రం కరోనా వ్యాక్సిన్ ను తీసుకునే విషయంలో అనేక సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడే అవకాశం అయితే ఉంటుందని చాలామంది భావిస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ అయితే ఉందని కొంతమంది భావిస్తున్నారు.
జర్మనీకి చెందిన ఇమ్యునాలజీ నిపుణులు కరోనా వ్యాక్సిన్ల వల్ల సంవత్సరాల తర్వాత దుష్ప్రభావాలు కలిగే అవకాశాలు ఉంటాయనే వార్తల్లో నిజాలు లేవని చెప్పుకొచ్చారు. శరీరం వ్యాక్సిన్ ను స్వీకరించిన కొన్ని వారాల తర్వాత వ్యాక్సిన్ కు స్పందిస్తుందని వాళ్లు తెలిపారు. అరుదుగా మాత్రమే సిరల సైనస్ థ్రాంబోసిస్ లేదా గుండె కండరాల వాపు వచ్చే అవకాశాలు ఉంటాయి.
కరోనా వ్యాక్సిన్ ను తీసుకున్న కొంతమందిలో పెర్కిర్డిటిస్, పెరికార్డియం యొక్క వాపు, గుండె కండరాల వాపు, మయోకార్డిటస్ లాంటి సమస్యలు ఉన్నాయి. మనం తీసుకునే కరోనా వ్యాక్సిన్లు స్పైక్ ప్రోటీన్ కు సంబంధించిన జన్యు నమూనాలను కలిగి ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపించి ప్రతిరోధకాలను ఉత్పత్తి చేయడంలో ఉపయోగపడతాయి. కరోనా వ్యాక్సిన్ల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ తక్కువేనని ప్రజలు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా వ్యాక్సిన్ ను తీసుకుంటే మంచిదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.