Vishal: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకునేలా చేసింది. హీరో గానే కాకుండా పలు సేవ కార్యక్రమాలతో గొప్ప పేరు సంపాదించుకున్నాడు పునీత్. 1800 మందికి పైగా పిల్లలకు ఉచిత విద్య, 45 ఫ్రీ స్కూల్స్ , 26 అనాధాశ్రమాలు, 16 వృద్దాశ్రమాలు, 19 గోశాలలు కట్టించారు పునీత్. అలానే ఆయన తన రెండు కళ్ళను కూడా దానం చేశారు. అయితే విశాల్, ఆర్య కాంబినేషన్ లో మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆయన నటించిన ఎనిమి సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఈవెంట్ లో విశాల్ ఓ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు.
తన స్నేహితుడైన పునీత్ రాజ్ కుమార్ మరణం తర్వాత ఆయన చదివిస్తున్న 1800 మంది పిల్లల బాధ్యతను తాను తీసుకుంటున్నట్టు ప్రకటించారు విశాల్. ఇప్పటికే విశాల్ నటించిన సినిమాలకు సంబంధించిన ప్రతి టికెట్ ధర నుంచి ఒక రూపాయి రైతులకు చేరేలా చేస్తున్నారు. తనకు సంబంధించిన ఫంక్షన్స్ లో బొకేలను వాడొద్దని వాటికీ ఉపయోగించే డబ్బు ఆడపిల్లల చదువుకు ఉపయోగించమని కోరుతూ ఉంటారు. ఇక ఇప్పుడు ఇలా పునీత్ బాధ్యతను తన భుజాలపై వేసుకొని మరోసారి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు విశాల్.
ఈ సినిమాకు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించగా … మినీ స్టూడియోస్ పతాకంపై వినోద్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు తమన్ స్వరాలు అందిస్తున్నారు. మృణాళిని రవి, మమత మోహన్ దాస్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. అలాగే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషించారు.