https://oktelugu.com/

Always Health Problems At Home: ఇంట్లో ఎప్పటికీ అనారోగ్య సమస్యలు ఉంటున్నాయా? మీరు చేసే తప్పులు ఇవే..

కొంత మంది మిషన్ కంటే ఎక్కువగా పనిచేస్తారు.. రాత్రిళ్లు కూడా నిద్రపోకుండా డబ్బు సంపాదిస్తారు. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని ధనం ఆర్జించాలనే కోరికతే తీవ్రంగా శ్రమిస్తారు. కానీ ఇంట్లో డబ్బు నిల్వదు. ఇంట్లో ఒకరి తరువాత ఒకిరికి అనారోగ్య సమస్యలు.

Written By:
  • Srinivas
  • , Updated On : November 21, 2024 / 11:28 AM IST

    Always Health Problems At Home

    Follow us on

    Always Health Problems At Home: కొంత మంది మిషన్ కంటే ఎక్కువగా పనిచేస్తారు.. రాత్రిళ్లు కూడా నిద్రపోకుండా డబ్బు సంపాదిస్తారు. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని ధనం ఆర్జించాలనే కోరికతే తీవ్రంగా శ్రమిస్తారు. కానీ ఇంట్లో డబ్బు నిల్వదు. ఇంట్లో ఒకరి తరువాత ఒకిరికి అనారోగ్య సమస్యలు. ఆ తరువాత కుటుంబ సభ్యుల మధ్య గొడవలు.. ఏదో తెలియని అసంతృప్తి.. ఇవన్నీ ఉండడానికి కారణం తెలియక చాలా మంది అయోమయానికి గురవుతూ ఉంటారు. ఈ క్రమంలో తీవ్ర ఒత్తిడిని కలిగి అనారోగ్యానికి గురవుతూ ఉంటారు.అయితే ఇంట్లో ధనం నిల్వాలన్నా.. ఇంట్లో ఉన్న వారంతా సంతోషంగా ఉండాలన్నా.. కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే కాదు.. ఇంట్లోని వస్తువులు సరైన దిశలో ఉంచాలి. అప్పుడే కుటుంబ సభ్యుల మధ్య ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా ఉంటారు. అయితే ఒక్కోసారి వరుసగా కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురికావడానికి కొన్ని వస్తువులు సరైన దిశలో లేకపోవడమేనని కొందరు వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి వస్తువులు.. ఎక్కడ ఉంచాలంటే?

    ఇల్లు శుభ్రంగా ఉంటేనే ఇంట్లో ఉన్న వాళ్లంతా ఆరోగ్యంగా ఉంటారు. కానీ కొందరు బద్ధకం లేదా ఇతర కారణాల వల్ల బయట ఉంచాల్సిన వస్తువులను ఇంట్లో ఉంచుతారు. అంతేకాకుండా పడేయాల్సి వస్తువులను కూడా ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఇంట్లో ఉన్నవాళ్లు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయని వాస్తు శాస్త్రం తెలుపుతుంది. ప్రతిరోజూ ఇంట్లోని చెత్తను ఊడ్చేస్తారు. కానీ ఈ చెత్తను పడేసే డస్ట్ బిన్ ను కొందరు ఇంట్లోనే ఉంచుతారు. దీనిని బయట ఉంచాలి. చెత్తబుట్ట ఇంట్లో ఉంచడం వల్ల ఇంటికి మంచిది కాదు. దీని వల్ల నెగెటివ్ ఎనర్జీ పాస్ కావడమే కాకుండా ఇందులో ఉండే బ్యాక్టీరియా వల్ల ఇంట్లోని వారు అనారోగ్యానికి గురవుతూ ఉంటారు.

    కొందరు ఇంట్లో వరకు చెప్పులతో వస్తారు. చెప్పులు అశుభం తెస్తాయి. ఇవి కొత్తవి అయినా.. పాతవి అయినా.. ఇంటి బయట ఉన్న ప్రత్యేక ప్రదేశాల్లో ఉంచాలి. వీటిని ఇంటి ముందు కూడా ఉంచరాదు. ఎందుకంటే ఇంటి ముందు చెప్పులు ఉండడం వల్ల లక్ష్మీదేవి రావడానికి సంకోచిస్తుంది. అంతేకాకుండా చెప్పులతో వివిధ ప్రదేశాల్లో తిరుగుతాం. ఆ తరువాత ఇంటికి వస్తాం. చెప్పుల్లో ఉండే క్రిములు ఇంట్లోకి రావడం వల్ల తొందరగా అనారోగ్యానికి గురవుతూ ఉంటారు.

    ఇంట్లోని కొన్ని వస్తువులు విరిగిపోయి లేదా పగిపోతూ ఉంటాయి. కానీ వీటిని బయటపడేసే విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు. ఇవి ఎంతకాలం ఇంట్లో ఉంటే అంత నెగెటివ్ ఎనర్జీ పాస్ అవుతుంది. దీంతో ఇంట్లో వారి ఆరోగ్యంపై ఈ ప్రభావం పడుతుంది. దీంతో అనారోగ్య సమస్యలు వస్తాయి. అందువల్ల ఇంట్లో ఏ వస్తువు అయినా డ్యామేజ్ అయి ఉంటే దానిని వెంటనే బయట పారేయడం మంచిది. లేకుంటే నష్టాలపాలవుతారు.

    ఇంటికి కీచెన్ ప్రధాన అవసరంగా ఉంటుంది. ఇంట్లోని కుటుంబ సభ్యులకు ఆహారం ఇక్కడి నుంచే. అందువల్ల ఈ గదిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ఈ గదిలో కాలం గడిచిన సరుకులు, పదార్థాలు ఉండడం వల్ల వీటి నుంచి బ్యాక్టీరియా వెలువడుతుంది. దీంతో ఇవి ఇతర ఆహార పదార్థాలపై పడి.. వాటిని తినడం వల్ల అనారోగ్యానికి గురవుతారు. అందువల్ల వంట గది విషయంలో అస్సలు నిర్లక్ష్యంగా ఉండొద్దు.