Anger: తన కోపమే తనకు శత్రువు అంటారు పెద్దలు. ఇది అక్షరాల నిజం కూడా. ఆవేశం పనికి రాదు. ఏంటి కొటేషన్లు చెబుతున్నారు అనుకుంటున్నారా? కాదండోయ్ ఆవేశంలో, కోపంలో అవకాశాలు కోల్పోయే ఛాన్స్ కూడా ఉంది. ఆరోగ్య నష్టం జరుగుతుంది. తీవ్రమైన వ్యాధులు కూడా వస్తాయి అంటున్నారు వైద్యులు. కొందరు చిన్న విషయాలకు కూడా గొంతు చించుకొని అరుస్తుంటారు. ఆరోగ్యాన్ని చేతులారా పాడు చేసుకుంటారు. అయితే ఈ కోపం మరిన్ని ఆరోగ్య సమస్యలను తెచ్చి పెడుతుందట.
మరి కోపం వల్ల వచ్చే ఆ సమస్యలు ఏంటో కూడా పూర్తిగా తెలుసుకుందాం. కోపం వల్ల కడుపులో అల్సర్, గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి అంటున్నారు నిపుణులు. కోపంగా ఉంటే మెదడులోని రక్తనాళాలు సంకోచించి రక్తనాళాలు దెబ్బతినేలా కూడా చేస్తుందట. విపరీతమైన కోపం ఉంటే రోగనిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. రోగ నిరోధక శక్తి తగ్గితే ఎన్నో అనారోగ్య సమస్యల వలయం అవుతుంది మీ శరీరం. ఇన్ఫెక్షన్ లు కూడా వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి కోపాన్ని అదుపులో పెట్టుకోవడం మంచిది.
అధిక కోపం వల్ల గుండెపోటు కూడా వస్తుందట. అంతేకాదు కొన్ని సార్లు ప్రాణాలు కూడా కోల్పోవచ్చు. తలనొప్పి, అధిక రక్తపోటు, నిద్రలేమి వంటి సమస్యలు వస్తుంటాయి. మానసిక ప్రశాంతత కరువై ఎప్పుడు ఇబ్బంది పుడుతూనే ఉంటారని చెబుతున్నారు నిపుణులు. కొన్ని సార్లు బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చే ప్రమాదం ఉందట.
పక్షవాతం వంటి సమస్యల ముప్పు కూడా లేకపోలేదట. ఇక ఎక్కువ కోపం ఉండే వ్యక్తుల్లో మధుమేహం వచ్చే ప్రమాదం ఉందట. చర్మ సంబంధిత సమస్యలు అయిన సోరియాసిస్, ఎగ్జిమా వంటివి వస్తాయి. మరి ఇన్ని వ్యాధులు రాకుండా ఉండాలంటే మీరు ఆస్పత్రుల్లో డబ్బులు కట్టకుండా ఉండాలంటే కేవలం కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది. మరి కోపం ఎలా కంట్రోల్ కావాలి అనే వివరాలు మరోసారి తెలుసుకుందాం.