Cranberries : మారిన జీవనశైలి వల్ల ప్రస్తుతం చాలామంది మలబద్దకం, గ్యాస్ సమస్యలతో బాధపడుతున్నారు. పోషకాలు, ఫైబర్ ఉండే ఫుడ్స్ తీసుకోకపోవడం, వాటర్ ఎక్కువగా తాగకపోవడం వల్ల మలబద్దకం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే మలబద్దకాన్ని తగ్గించాలంటే పోషకాలు ఉండే ఫుడ్ తీసుకోవడంతో పాటు, వాటర్ ఎక్కువగా తాగాలి. అలాగే తాజా పండ్లు కూడా ఎక్కువగా తినాలి. అయితే పండ్లలో ఎన్నో రకాలు ఉన్నాయి. అన్ని పండ్లు కూడా ఆరోగ్యానికి మంచిదే. వీటిని డైలీ డైట్‌లో చేర్చుకోవడం వల్ల నష్టాలు కంటే లాభాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే మలబద్దకం సమస్య చాలా తీవ్రమైనది. దీనికి చెక్ పెట్టాలంటే డైట్‌లో కొన్ని రకాల పండ్లను యాడ్ చేసుకోవాలి. అందులో క్రాన్బెర్రీస్ ఒకటి. ఈ పండును తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే ఇందులోని పోషకాలు చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపర్చడంలో బాగా ఉపయోగపడతాయి. రోజుకి ఒక్కసారైన ఈ పండును తినడం వల్ల మలబద్దకం, గ్యాస్ వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. చిన్నగా, గుండ్రంగా ఉండే పుల్లని క్రాన్బెర్రీస్‌ను తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చాలామంది వీటిని ఎక్కువగా వాడుతుంటారు.
క్రాన్బెర్రీస్ పండ్లను మాత్రమే కాకుండా ఆకులు, బెరడును కూడా ఔషధ గుణాలకు వాడుతారు. ఇందులో ఆయుర్వేద పోషకాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో విటమిన్ సి, ఐరన్, కాల్షియం, పొటాషియం, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయని ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయని చెబుతున్నారు. ఈ పండ్లు జుట్టుకి, చర్మానికి కూడా మేలు చేస్తాయి. ఇందులో ఉండే ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మంపై మొటిమలు, ముడతలు రాకుండా ఉంచడంలో కాపాడుతుంది. అలాగే వృద్దాప్యం రాకుండా యంగ్ లుక్‌లో కనిపించేందుకు కూడా సాయపడుతుంది. క్రాన్బెర్రీస్‌లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. ఇవి జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంలో బాగా సాయపడుతుంది. తద్వారా మలబద్దకం, గ్యాస్, వంటి సమస్యలు తొందరగా తగ్గుతాయి. అలాగే రక్తహీనత సమస్యను తగ్గించి ఎముకలను బలంగా మార్చడంలో సహాయపడతాయి.
చాలా మంది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్‌తో బాధపడుతుంటారు. ఇన్ఫెక్షన్‌ను నిరోధించే యాంటీ క్లింగింగ్ లక్షణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఈ సమస్యను తగ్గించడంలో కాన్బెర్రీస్ బాగా సాయపడతాయి. అలాగే రొమ్ము క్యాన్సర్, పేగు క్యాన్సర్ వంటి సమస్యలను కూడా నిరోధించే లక్షణాలు ఈ కాన్బెర్రీస్‌లో ఉన్నాయి. బరువు తగ్గడానికి సహాయపడటంతో పాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. దంత సమస్యలు రాకుండా ఉండటంతో పాటు రోగనిరోధక శక్తిని కూడా పెంచడంలో సహాయపడతాయి. కొందరు ఊపిరితిత్తుల సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. వీటి నుంచి విముక్తి పొందాలంటే కాన్బెర్రీస్ బాగా ఉపయోగపడతాయి. కాబట్టి రోజూ డైట్‌లో వీటిని యాడ్ చేసుకోవడం ఆరోగ్యానికి చాలా మేలు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.