Amla Juice Benefits: కాలం మారుతున్న కొద్దీ కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. రెండేళ్ల కిందట కరోనా వైరస్ తో ప్రపంచం అతలాకుతలమైపోయింది. ఆ సమయంలో ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తి కోసం రకరకాల ప్రయత్నాలు చేశారు. విటమిన్ ‘సి’తో ఇమ్యూనిటీ పవర్ పెంచుకుంటే కరోనా నుంచి తట్టుకోగలమని కొందరు వైద్యులు పేర్కొన్నారు. దీంతో విటమిస్ సి మెడిసిన్స్ విపరీతంగా వాడారు. అయితే విటమిన్ సి కోసం ఏ మెడిసిన్ వాడక్కర్లేదు. ఏ వైద్యం చేయించుకోనక్కర్లేదు. కొన్ని ఆహార పదార్థాల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇమ్యూనిటీ పవర్ అత్యధికంగా వస్తుంది. మరి ఆ పదార్థాలేవో తెలుసుకుందామా..
వర్షాకాలం ప్రారంభమైందంటే వ్యాధులు విజృంభిస్తుంటాయి. ఈ సమయంలో రోగనిరోధక శక్తి పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాతావరణంలో మార్పులతో నీటితో పాటు ఆహార పదార్థాలు కలుషితం అవుతాయి. అయితే కొన్ని పదార్థాలు మాత్రం కాలం ఎలా ఉన్నా వాటిలో ఉండే విటమిన్స్ కు ఎలాంటి భంగం కలగవు. అంతేకాకుండా ఇవి కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా కాపాడుతాయి. అందువల్ల వీటిని తప్పకుండా తీసుకోవాలని కొందరు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వీటిలో ప్రధానమైనది ఉసిరి. ఉసిరికాయలను ఎక్కువగా కార్తీకమాసంలోనే చూస్తాం. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉసిరికాయలతో ప్రత్యేక పూజలు చేస్తారు. ఉసిరికాయలతో స్నానం చేయడం వల్ల ఎంతో ఆరోగ్యం అని అంటారు. అయితే ఉసిరితో చేసిన జ్యూస్ తాగడం వల్ల మరింత ఇమ్యూనిటీ వస్తుందని అంటున్నారు. ఉసిరిలో కాల్షియం, సోడియం, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. కొలెస్ట్రాల్ తగ్గించే గుణం ఎక్కువగా ఉంటుంది. ఇందులో రక్తంలో చక్కెరను తగ్గించే గుణాలు ఉంటాయి. దీంతో డయాబెటీస్ వారికి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయి.
ఉసిరితో పాటు కలబంద జ్యూస్ తోనూ అత్యధిక ప్రయోజనాలు ఉన్నాయి. ఆయుర్వేద వైద్యులు ఎక్కువగా కలబంధ జ్యూస్ తీసుకోవాలని సలహా ఇస్తుంటారు. ఇందులో నూ రోగ నిరోధక శక్తి పెంచే గుణాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా విటమిన్ సి ఎక్కువగా ఉండడంతో ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. జీర్ణక్రియను సక్రమంగా ఉంచడంలో కలబంధ జ్యూస్ ను తప్పనిసరిగా తీసుకోవాలని చెబుతూ ఉంటాయి.
ఉదయం పరగడుపున ఈ జ్యూస్ తాగడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా మధుమేహవ్యాధి గ్రస్తులు కలబంధ, ఉసిరి జ్యూస్ తో పాటు సీతాఫల రసాన్ని తాగడం వల్ల ప్యాంక్రియాస్ కార్యకలాపాలను ప్రేరేపిస్తుంది. అలాగే గోరువెచ్చని నీటిలో ఉసిరికాయలు వేసుకొని తాగడం వల్ల గొంతులో పేరుకుపోయిన శ్లేష్మం క్లియర్ అవుతుంది.