Aishwarya Rai Daughter: ఐశ్వర్యరాయ్ కూతురు స్కూల్ ఫీజు తో చిన్నపాటి ఇల్లు కట్టేయచ్చు… ఎన్ని లక్షలో తెలుసా?

సినీ ఇండస్ట్రీ లైఫ్ మిగతా వాటికంటే భిన్నంగా ఉంటుంది. ఇక్కడ కోట్లల్లో టర్నోవర్ అవుతూ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన కొందరు అత్యధిక ధనవంతులుగా మారిపోయారు.

Written By: Chai Muchhata, Updated On : September 30, 2023 2:26 pm

Aishwarya Rai Daughter

Follow us on

Aishwarya Rai Daughter: అందాల రాశి ఐశ్వర్య రాయ్ గురించి తెలియని వారుండరు. ఎవరినైనా అందంతో పొగడాలంటే ఐశ్వర్యరాయ్ పేరే చెబుతుంటారు. విశ్వసుందరిగా కిరీటం తెచ్చుకున్న తరువాత సినిమాల్లో స్టార్ నటి అయిన ఐశ్వర్య.. ఆ తరువాత అభిషేక్ బచ్చన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఆరాధ్య అనే కూతురు ఉంది. ఈ పాప గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. తాజాగా ఆరాధ్య స్కూల్ ఫీజు గురించి తెలిసి ఫ్యాన్ష్ షాక్ అవుతున్నారు. ఆమె స్కూల్ ఫీజు కోసం ఇంత ఖర్చుపెడుతున్నారా? అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆరాధ్య స్కూల్ ఫీజు ఎంతో తెలుసా?

సినీ ఇండస్ట్రీ లైఫ్ మిగతా వాటికంటే భిన్నంగా ఉంటుంది. ఇక్కడ కోట్లల్లో టర్నోవర్ అవుతూ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన కొందరు అత్యధిక ధనవంతులుగా మారిపోయారు. అందుకే సినిమాల్లో ఒక్క ఛాన్స్ వస్తే చాలు జీవితం మారిపోతుందని భావిస్తారు. సినీ ఫీల్డులోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత టాలెంట్ ను భట్టి రెమ్యూనరేషన్ మారిపోతుంది. స్టార్ నటులుగా మారితే అత్యధికంగా ఉంటుంది. ఈ క్రమంలో బాగా డబ్బు సంపాదించిన కొందరు లగ్జరీ లైఫ్ ను గడుపుతారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్ బీ కుటుంబం ఎప్పటినుంచో సినిమాల్లో కొనసాగుతోంది. అమితాబ్ బచ్చన్ నుంచి ఐశ్వర్యరాయ్ వరకు అందరూ సినిమాల్లో కొనసాగారు.

ఐశ్వర్య రాయ్ సినిమాల్లో స్టార్ నటిగా కొనసాగుతున్న తరుణంలోనే అభిషేక్ బచ్చన్ ను 2007లో వివాహం చేసుకుంది. ఆ తరువాత వీరికి ఆరాధ్య జన్మించింది. ఆరాధ్య గురించి ఐశ్వర్య దంపతులు చెప్పకపోయినా కొందరు ఆమె గురించి తాజా అప్డేట్ గురించి సోషల్ మీడియాలో పెడుతున్నారు. తాజాగా ఆరాధ్య స్కూల్ ఫీజు గురించి కొందరు తెలియజేయడంతో ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఆరాధ్య ముంబయ్ లోని ధీరూబాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ లో చదువుతోంది.

అయితే ఆరాధ్య స్కూల్ ఫీజు రూ.10 లక్షలు ఉంటుందని తెలుస్తోంది. అత్యధిక ఉన్నత ప్రమాణాలు కలిగిన ఈ స్కూల్ లో ఎల్ కేజీ కి రూ.5 లక్షలు ఉందని సమాచారం. 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఏడాదికి రూ.15 నుంచి 20 లక్షలకు పైగా ఉంటుందని తెలుస్తోంది.బాగా డబ్బున్నవాళ్లు, సెలబ్రెటీలు మాత్రమే ఈ స్కూల్ లో తమ పిల్లలను చదివిస్తారని అర్థమవుతోంది. ప్రస్తుతం ఆరాధ్య కోసం రూ.10 లక్షలు ఖర్చుపెట్టడం చూసి అంతా షాక్ అవుతున్నారు.