ఆరోగ్య సమస్యలకు ఔషధంగా పిలవబడే పండ్లలో అంజీరా పండు ఒకటనే సంగతి తెలిసిందే. అంజీరా పండ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. జీర్ణ సమస్యలను దూరం చేయడంలో అంజీరా పండ్లు సహాయపడతాయి. సాధారణంగా పండ్లు తాజాగా తీసుకుంటే వాటి వల్ల ఎక్కువ పోషకాలు లభిస్తాయి. అయితే కొన్ని పండ్లు మాత్రం ఎండిపోయిన తరువాత తీసుకుంటే మాత్రమే ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అలాంటి పండ్లలో అంజీరా పండ్లు ఒకటి.
Also Read: అరిటాకులో భోజనం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..?
అంజీరా పండ్లు తినడం వల్ల రక్తహీనత సమస్యను సులభంగా అధిగమించవచ్చు. ఈ పండ్లను ఎంతకాలమైనా సులభంగా నిల్వ ఉంచుకోవచ్చు. శరీర బరువు తగ్గాలని భావించేవారు అంజీరా పండ్లను రోజూ తీసుకుంటే సులభంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ పండ్లను విడిగా కాకుండా ఇతర పండ్లతో కలిపి కూడా తీసుకోవచ్చు. అయితే రోజుకు నాలుగైదు అంజీరా పండ్ల కంటే ఎక్కువ పండ్లు తీసుకోకూడదు.
Also Read: తోటకూర తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..?
అంజీరా పండ్లలో ఎక్కువ మోతాదులో క్యాల్షియం లభిస్తుంది. సోడియం ఎక్కువగా పొటాషియం తక్కువగా ఉండే అంజీరా పండ్లను తీసుకుంటే బీపీ తగ్గుతుంది. ఫైల్స్ సమస్యతో బాధ పడేవాళ్లు రాత్రంతా నీళ్లలో నానబెట్టిన అంజీరా తీసుకుంటే ఆ సమస్య దూరమవుతుంది. అంజీరా పురుషుల్లో లైంగిక సమస్యలను దూరం చేయడంతో పాటు స్పెర్మ్ కౌంట్ ను పెంచడంలో సహాయపడుతుంది.
మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం
అంజీరా మహిళల్లో రొమ్ము క్యాన్సర్ రాకుండా సహాయపడటంతో పాటు జలుబును తగ్గించడంలో తోడ్పడుతుంది. అంజీరా ఆడపిల్లల్లో కొలెస్ట్రాల్ ను తగ్గించడంతో పాటు యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. అంజీరాలను తలకు నానబెట్టి మర్ధన చేస్తే తలలోని చుండ్రు పోవడంతో పాటు అనేక లాభాలను పొందే అవకాశం ఉంటుంది.