https://oktelugu.com/

మెగా ఫ్యామిలీలో బ్యాండ్ బాజా.. పెళ్లికి సిద్ధమైన యంగ్ హీరో?

మెగా డాట‌ర్ నిహారిక వివాహం ఎంత అంగ‌రంగ వైభంగా సాగిందో అంద‌రికీ తెలిసిందే. రాజ‌స్థాన్ లోని ఉద‌య్ పూర్ ప్యాలెస్ లో ఆద్యంతం క‌న్నుల పండువ‌గా సాగిందీ వేడుక‌. గ‌త డిసెంబ‌ర్ 9వ తేదీన జ‌రిగిన ఈ వివాహం.. మెగా అభిమానుల‌ను ఎంత‌గానో అల‌రించింది. అయితే.. మెగా ఫ్యామిలీలో మ‌రోసారి బ్యాండ్ బాజా మోగ‌నుంద‌ని ఓ న్యూస్ వైర‌ల్ అవుతోంది. త్వ‌ర‌లోనే ఓ మెగా హీరో పెళ్లి పీట‌లు ఎక్కబోతున్నాడ‌నే వార్త జోరుగా చ‌క్క‌ర్లు కొడుతోంది. మ‌రి, […]

Written By:
  • Rocky
  • , Updated On : February 11, 2021 / 11:26 AM IST
    Follow us on


    మెగా డాట‌ర్ నిహారిక వివాహం ఎంత అంగ‌రంగ వైభంగా సాగిందో అంద‌రికీ తెలిసిందే. రాజ‌స్థాన్ లోని ఉద‌య్ పూర్ ప్యాలెస్ లో ఆద్యంతం క‌న్నుల పండువ‌గా సాగిందీ వేడుక‌. గ‌త డిసెంబ‌ర్ 9వ తేదీన జ‌రిగిన ఈ వివాహం.. మెగా అభిమానుల‌ను ఎంత‌గానో అల‌రించింది. అయితే.. మెగా ఫ్యామిలీలో మ‌రోసారి బ్యాండ్ బాజా మోగ‌నుంద‌ని ఓ న్యూస్ వైర‌ల్ అవుతోంది. త్వ‌ర‌లోనే ఓ మెగా హీరో పెళ్లి పీట‌లు ఎక్కబోతున్నాడ‌నే వార్త జోరుగా చ‌క్క‌ర్లు కొడుతోంది. మ‌రి, ఆ హీరో ఎవ‌రు? ఎవ‌రిని పెళ్లి చేసుకోబోతున్నాడు? అనే వివ‌రా‌లు మీకోసం..

    Also Read: ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. బన్నీకి మరో సరికొత్త రికార్డ్ !

    ‘సాయిధ‌ర‌మ్ తేజ్..’ మెగా మేనల్లుడు.. మెగాస్టార్ నట వారసుడు మాత్రమే కాకుండా.. ఆయన పోలికలను కూడా పునికి పుచ్చకున్నవాడు. మెగా కాంపౌండ్ నుంచి వెండి తెరమీదకు దూసుకొచ్చిన సాయి తేజ్.. అనతి కాలంలోనే సుప్రీం హీరోగా బ్రాండ్ సంపాదించుకున్నాడు. ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ యువ హీరో.. వ‌రుస విజ‌యాల‌ను అందుకుంటూ స‌క్సెస్ ఫుల్ హీరోగా త‌న కెరీర్ ను సుస్థిరం చేసుకున్నాడు. మ‌ధ్య‌లో కొన్ని అప‌జయాలు ఎదురైన‌ప్ప‌టికీ.. వెనుకంజ వేయ‌కుండా త‌న సినీ జ‌ర్నీ కంటిన్యూ చేస్తున్నాడు తేజ్‌.

    వాస్త‌వానికి ‘రేయ్’ సినిమాతో తేజు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అవ్వాల్సి ఉంది. కానీ.. ఆ సినిమా డిలే కావ‌డంతో ‘పిల్లా నువ్వు లేని జీవితం’ ద్వారా ఎంట్రీ ఇచ్చాడు సాయి. రేయ్ సినిమాతో వ‌స్తే ఫ్యూచ‌ర్ ఎలా ఉండేదోగానీ.. అది ఆల‌స్యం కావ‌డంతో విజ‌యంతోనే అరంగేట్రం చేశాడు తేజూ. ఆ త‌ర్వాత ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’, ‘సుప్రీమ్’ వంటి హిట్ సినిమాల‌తో కెరీర్ జోరుగా సాగుతుండ‌గా.. మ‌ధ్య‌లో కొన్ని వైఫల్యాలు ఎదుర‌య్యాయి.

    హ్యాట్రిక్ విజ‌యాలు సొంతం చేసుకున్న సాయి ధ‌ర‌మ్ తేజ్.. హ్యాట్రిక్ ఫెయిల్యూర్స్ ను కూడా చ‌వి చూశాడు. ఆ త‌ర్వాత ‘చిత్రలహరి’ సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కేశాడు. ఆ తర్వాత ‘ప్రతిరోజూ పండగే’, లేటెస్ట్ గా వచ్చిన ‘సోలో బ్రతుకే సో బెటర్’తో వరుస విజయాలు సొంతం చేసుకొని మంచి ఫాంలో ఉన్నాడు సాయి ధరమ్ తేజ్.

    Also Read: ఉగ్రరూపంలో విజయ్ దేవరకొండ.. ‘లైగర్’ రిలీజ్ డేట్ ఇదే..

    ఇలాంటి పరిస్థితుల్లో తేజూ ఓ ఇంటివాడు కాబోతున్నాడన్న వార్త హల్ చల్ చేస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్లుగా ఉన్న హీరోల్లో సాయి ధరమ్ కూడా ఉన్నాడు. ఈ కారణం చేత.. అతను పెళ్లి చేసుకోబోతున్నాడనే రూమర్ బయటకు రాగానే.. నిజమే అని నమ్మేస్తున్నారు చాలా మంది. ఇలా పలుమార్లు తేజూ పెళ్లి వార్తలు చక్కర్లు కొట్టినప్పటికీ.. ఈ సారి మాత్రం నిజంగానే బ్యాచ్ లర్ లైఫ్ కు గుడ్ బై చెప్పబోతున్నాడనే ప్రచారం గట్టిగానే సాగుతోంది.

    అందుతున్న లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. పెళ్లికి సంబంధించిన చర్చలు కూడా ముగిశాయని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే.. వచ్చే మే నెలలోనే దాంపత్య జీవితంలో అడుగు పెట్టబోతున్నాడట సాయి తేజ్. మే నెల కన్నా ముందుగానే వివాహ తంతు ముగించాలని భావించినప్పటికీ.. సరైన ముహూర్తాలు లేవని పోస్ట్ పోన్ చేసినట్టుగా చెబుతున్నారు.

    సాయి పెళ్లి మ్యాటర్ ఎత్తగానే అందరూ అడుగుతున్న ప్రశ్న అమ్మాయి ఎవరు అని. అయితే.. పెళ్లి కూతురు ఓ బిజినెస్ మెన్ కూతురు అని తెలుస్తోంది. ఇరు కుటుంబాల పెద్దలు కుదిర్చిన పెళ్లికే చైతూ ఓకే చెప్పాడని సమాచారం. ఈ పెళ్లి వేడుకను మేనమామలు చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్ చేతుల మీదుగా జరగనుందని ఫిల్మ్ నగర్ టాక్. మరి, ఈ వార్తలపై సాయితేజూ ఏవిధంగా స్పందిస్తాడో చూడాలి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్