
సాధారణంగా పూజ కొరకు ఉత్తరేణి ఆకును ఎక్కువగా వినియోగిస్తారనే సంగతి తెలిసిందే. ఉత్తరేణి ఆకు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను సైతం పొందే అవకాశం అయితే ఉంటుంది. ఆయుర్వేదంలో సైతం ఉత్తరేణి ఆకుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. విష జంతువులు కుట్టిన సమయంలో ప్రాథమిక చికిత్స కోసం ఉత్తరేణి ఆకును వినియోగించుకోవచ్చు. ఉత్తరేణి వల్ల బాణపొట్టకు కూడా సులభంగా చెక్ పెట్టే అవకాశం ఉంటుంది.
ఉత్తరేణి కషాయం మూత్రసంబంధిత సమస్యలకు చెక్ పెట్టడంతో పాటు కిడ్నీలను శుభ్రం చేయడంలో సహాయపడుతుంది. కఫము , శరీర ఉబ్బు , నొప్పులు, గజ్జి , కుష్టు, ఇతర ఆరోగ్య సమస్యలకు ఉత్తరేణి ఆకు చెక్ పెడుతుంది. కాయసిద్ధి ఔషధం పేరుతో పిలిచే ఉత్తరేణిని వయస్సు పెరగకుండా తయారు చేసే ఔషధాల్లో కూడా వినియోగిస్తారు. పాలలో ఉత్తరేణి విత్తనాలను వేసుకుని తింటే కడుపునొప్పి దూరమవుతుంది.
అజీర్ణ సమస్యలకు ఉత్తరేణి భస్మం మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. కుక్క కరిచిన వాళ్లకు ఉత్తరేణి దివ్యౌషధంగా పని చేస్తుందని చెప్పవచ్చు. ఉత్తరేణి భస్మంతో పాటు తేనె తీసుకుంటే ఉబ్బసం సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఉత్తరేణి రసంలో దూది పెట్టి పంటి కింద పెడితే పుప్పిపంటి నొప్పి సమస్య దూరమవుతుంది. జ్వరాన్ని తగ్గించడంలో కూడా ఉత్తరేణి ఎంతగానో సహాయపడుతుందని చెప్పవచ్చు.
కందిరీగ , తెనెటీగ కుట్టిన సమయంలో ఆకును నీళ్లలో కలిపి నూరితే నొప్పి తగ్గుతుంది. ముల్లంగి గింజలతో కలిపి ఉత్తరేణి రసం తీసుకుని సొరియాసిస్ మచ్చలపై రాస్తే ఆ మచ్చలు క్రమంగా తగ్గుతాయి.