
ప్రకృతి నుంచి లభించే ఆకులు, కాయలు, చెట్లను ఆయుర్వేద వైద్య విధానంలో ఎక్కువగా ఉపయోగిస్తారనే సంగతి తెలిసిందే. ఔషధ గుణాలను కలిగి ఉన్న చెట్లలో విరిగి చెట్టు కూడా ఒకటి కాగా ఈ చెట్టు పండ్లను విరిగి పండ్లు, నక్కెర పండ్లు అని పిలుస్తూ ఉంటారు. ఈ పండ్ల చెట్లు పట్టణాలతో పోలిస్తే పల్లెటూళ్లలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. నక్కెర పండ్లు తినడం వల్ల షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.
రక్తంలోని గ్లూకోజ్ స్థాయి కంట్రోల్ చేయడంలో నక్కెర పండ్లు ఎంతగానో సహాయపడతాయి. రోజుకు ఐదారు పండ్లు తినడం ద్వారా మలబద్ధకం, అజీర్తి, గ్యాస్ సంబంధిత సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఈ పండ్ల చెట్టు బెరడును ఆయుర్వేద మందులలో వినియోగిస్తారు. ఈ చెట్టు బెరడును ఎండబెట్టి పొడిచేసి ఆ పొడిని మెత్తటి పేస్ట్ లా శరీరంపై అప్లై చేసుకుంటే చర్మ సంబంధిత సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
మహిళలకు రుతు సంబంధిత సమస్యలకు చెక్ పెట్టడంలో ఈ పండు ఎంతగానో తోడ్పడుతుంది. ఈ చెట్టు బెరడు కషాయాన్ని పుండ్లకు రాస్తే పుండ్లు త్వరగా నయమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. వీర్యకణాలు తక్కువగా ఉన్న పురుషులు వీటిని తింటే వీర్య కణాల వృద్ధి జరుగుతుంది. నక్కెర పండ్లు సీజన్ పండ్లు కావడంతో ఈ పండ్లను సేకరించి నీడలో ఆరబెట్టి చూర్ణం చేసుకుంటారు.
గిరిజన ప్రాంతాలలో ఈ పండ్లను లడ్డూలలా చేసుకుంటారు. వీటిని తినడం వల్ల శరీరానికి బలం చేకూరుతుంది. ఈ పండ్లు అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి ఈ పండ్లను తక్కువగా తీసుకుంటే మంచిది.