
కరోనాపై కొవాగ్జిన్ టీకా 77.8 శాతం సమర్థంగా పని చేస్తున్నట్లు భారత్ బయోటెక్ ప్రకటించింది. ఈ మేరకు కొవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ వివరాలను విడుదల చేసింది. కొవిడ్ లక్షణాలు తీవ్రంగా ఉన్న వారిలో కొవాగ్జిన్ టీకా 93.4 శాతం సమర్ధంగా పని చేస్తున్నట్లు వెల్లడించింది. డెల్టా వేరియంట్ పై 65.2 శాతం ప్రభావం చూపుతున్నట్లు భారత్ బయోటిక్ ఎండీ కృష్ణ ఎల్ల తెలిపారు. తీవ్ర లక్షణాలు నిలువరించి ఆస్పత్రిలో చేరే అవసరాన్ని కొవాగ్జిన్ తగ్గిస్తోందని వివరించారు.