ప్రపంచ దేశాలకు శరవేగంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి ఎన్నో పాఠాలను నేర్పిన సంగతి తెలిసిందే. కరోనా విజృంభణ తరువాత ప్రజల్లో చాలామందిలో ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో పాటు శారీరకంగా దృఢంగా ఉండాలనే ఉద్దేశంతో ఎక్కువమంది వ్యాయామంపై దృష్టి పెడుతున్నారు. ఇంట్లోనే చిన్నపాటి జిమ్ లను ఏర్పాటు చేసుకుని వ్యాయామం చేసేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
Also Read: గ్రీన్ టీ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?
యూట్యూబ్ వీడియోల ద్వారా, వ్యాయామ నిపుణుల సూచనల ద్వారా చాలామంది వ్యాయామం చేస్తున్నారు. మన దేశంలోని ప్రజలు కరోనా విజృంభణ తరువాత జీవనశైలిని మార్చుకున్నారని ఒక సర్వేలో వెల్లడైంది. 2,428 మందిపై జరిగిన సర్వేలో 70 శాతం మంది శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆన్ లైన్ ఆర్డర్ల ద్వారా కూడా చాలామంది కూరగాయలు, పండ్లకు సంబంధించిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటున్నారు.
Also Read: ఆ విధంగా భోజనం చేస్తే పరమ దరిద్రం… మరి ఇలా చేస్తే..!
ఒక సర్వే ప్రకారం లాక్ డౌన్ సమయంలో వ్యాయామ పరికరాల విక్రయాలు ఏకంగా 170 శాతం పెరిగాయి. అయితే వైద్యులు మాత్రం నిపుణుల సూచనల ప్రకారమే వ్యాయామం చేయాలని సూచనలు చేస్తున్నారు. వ్యాయామం చేసేవాళ్లు ఇతర వ్యాయామాలతో పోలిస్తే సైక్లింగ్, వాకింగ్, స్విమ్మింగ్ చేస్తే మంచిదని నిపుణులు వెల్లడిస్తున్నారు. సిక్స్ ప్యాక్ కోసం సొంతంగా ప్రయత్నాలు చేయవద్దని చెబుతున్నారు.
మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం
పౌడర్లు, పానీయాలు తాగి మంచి శరీర సౌష్టవాన్ని పొందవచ్చనే ప్రకటనల్లో నిజం లేదని నిపుణులు వెల్లడించారు. సరిగ్గా నిద్ర లేకుండా, శరీరానికి సరిపడా నీరు తీసుకోకుండా వ్యాయామం చేసినా ప్రాణాలకే ప్రమాదం అని చెబుతున్నారు. ఇష్టానుసారం యోగాసనాలు వేస్తే ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతుండటం గమనార్హం.