మనలో చాలామంది బీట్ రూట్ ను తినడానికి ఇష్టపడరు. బీట్ రూట్ తినడం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. రోజూ బీట్ రూట్ రసాన్ని తీసుకుంటే శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. రక్తహీనత సమస్యతో బాధపడేవాళ్లు బీట్ రూట్ ను తీసుకుంటే మంచిది. రోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ ను తాగితే శరీరంలో ఐరన్ లెవెల్స్ తో పాటు హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి.
Also Read: గ్రీన్ టీ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?
నీరసంతో బాధ పడేవాళ్లు బీట్ రూట్ జ్యూస్ లేదా బీట్ రూట్ ముక్కలు తీసుకుంటే నీరసం తగ్గడంతో పాటు శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది. బీట్ రూట్ జ్యూస్ వల్ల శరీరానికి అవసరమైన బీ, సీ విటమిన్లు లభించడంతో పాటు రక్తపోటు అదుపులో ఉంటుంది. తరచూ బీట్ రూట్ తినేవాళ్లు గుండె జబ్బుల బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శరీరంలోని కొవ్వును వేగంగా కరిగించడంలో బీట్ రూట్ సహాయపడుతుంది.
Also Read: కొబ్బరి నూనెతో సులభంగా బరువు తగ్గవచ్చు.. ఎలా అంటే..?
పిల్లలు ప్రతిరోజూ గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ తాగితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. బీట్ రూట్ జ్యూస్ ద్వారా కడుపులోని బిడ్డ పెరుగుదలకు అవసరమైన ఫోలిక్ యాసిడ్ లభిస్తుంది. బీట్ రూట్ జ్యూస్ వల్ల కాలేయం శుభ్రం కావడంతో పాటు కాలేయ సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. బీట్ రూట్ జ్యూస్ వల్ల రక్తంలో నైట్రేట్ రెట్టింపు కావడంతో పాటు కండరాలు చురుకుగా లభిస్తాయి.
మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం
బీట్ రూట్ జ్యూస్ తాగేవారిలో ఎముకలు దృఢంగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. బీట్ రూట్ తీసుకునే వారికి క్యాన్సర్ ముప్పు తగ్గుతుందని వైద్యులు వెల్లడిస్తున్నారు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న బీట్ రూట్ ను రోజూ తీసుకుంటే మంచిది.