Alcohol Effects On Sleep: మద్యపానం హానికరం.. అని కొన్ని ప్రత్యేక ప్రదేశాల్లో బోర్డులు కనిపిస్తూ ఉంటాయి. కానీ చాలామంది దీనిని పట్టించుకోకుండా అని మద్యం సేవిస్తూ ఉంటారు. ఒత్తిడి నుంచి దూరం కావడానికి.. బాధలు మరిచిపోవడానికి.. మద్యం ఉపకరిస్తుందని కొందరు భావించి ప్రతిరోజు కనీసం రెండు పెగ్గులు తాగే వారు ఉన్నారు. అయితే కొందరు వ్యసనం లాగా ఏర్పాటు చేసుకొని ఫుటుగా తాగుతున్నారు. మద్యం ఎలా తాగిన శరీరానికి అనారోగ్యమే అని వైద్యులు తెరిచారు. గతంలో రోజుకు రెండు పెగ్గులు తీసుకుంటే గుండెకు మేలు చేస్తుందని కొంతమంది తెలిపినా.. ఇటీవల తేలిన పరిశోధనల ప్రకారం రెండు పెగ్గులు సైతం మద్యం హానికరమైన పరిశోధకులు చెప్పారు. అయితే కొంతమంది మద్యం రాత్రిళ్ళు తాగి వెంటనే నిద్రపోతారు. ఇలా చేయడం వల్ల ఎలాంటి పరిణామాలు ఉంటాయంటే?
పొద్దంతా కష్టపడి రాత్రి నిద్రపోయేసరికి ఏదో మనసులో తెలియని ఆందోళన ఉంటుంది. ముఖ్యంగా శారీరకంగా శ్రమ పడేవారు నొప్పుల నుంచి తట్టుకోవడానికి మద్యం సేవిస్తూ ఉంటామని చెబుతుంటారు. కానీ ఇది తాత్కాలికంగా ఉపశమనాన్ని ఇస్తుంది. దీర్ఘకాలికంగా మాత్రం అనారోగ్యమే అని కొందరు వైద్య పరిశోధకులు తెలుపుతున్నారు. అయితే ఎన్ని సూచనలు ఇచ్చినా కొందరు మద్యం సేవించకుండా ఉండలేరు. అలాంటప్పుడు ఒక క్రమ పద్ధతిలో మధ్యాన్ని తీసుకోవడం వల్ల కొంతవరకు సమస్యలను తగ్గించుకోవచ్చని అంటున్నారు.
చాలామంది ఉదయం విధుల్లోకి వెళ్లి రాత్రి మద్యం సేవించి నిద్రపోతూ ఉంటారు. అయితే సరైన నిద్ర లేని కారణంగా కూడా మద్యం తాగే వారు ఉన్నారు. మద్యం తాగాగానే నిద్ర వస్తుందని కొందరు అలవాటు పడిపోయారు.. ఈ క్రమంలో భోజనం చేసిన తర్వాత మద్యం తాగిన వెంటనే నిద్రపోవుతుంటారు. అయితే ఇలా చేయడం వల్ల కడుపులో ఆల్కహాల్ అలాగే ఉండిపోయి అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అంతేకాకుండా డిహైడ్రేషన్ ఏర్పడి రాత్రిళ్ళు తీవ్రంగా దాహం ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో అందుబాటులో తాగునీరు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
Also Read: Alcohol: ఏ వయస్సు వారు అధికంగా మద్యం సేవిస్తున్నారంటే?
అందువల్ల రాత్రి మద్యం సేవించేవారు పడుకునే ముందు కచ్చితంగా అవసరమైన నీరుని తాగాలని చెబుతున్నారు. అంతేకాకుండా పడుకునే ముందు మాత్రమే కాకుండా కనీసం నిద్రపోయే గంట ముందు మద్యం తాగి ఆ తర్వాత .. నీటిని తీసుకోవాలని అంటున్నారు. మద్యంతోపాటు నీటి శాతం కూడా ఎక్కువగా ఉండడంతో కొంతవరకు డైజేషన్ సమస్య కూడా తగ్గే అవకాశం ఉంటుందని అంటున్నారు. అంతేకాకుండా వేసవికాలంలో ఇలా మద్యం తాగి వెంటనే నిద్రపోవడం వల్ల శరీరం తీవ్ర అలసటకు గురై.. శరీరంలో ఉండే లవణ శాతం తగ్గిపోయే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. మిగతా కాలంలో కూడా నిద్రపోయే ముందు మద్యం సేవించకుండా.. కనీసం గంట లేదా రెండు గంటల ముందు మద్యం సేవించి పడుకోవాలని అంటున్నారు. వీలైతే మద్యం సేవించిన తర్వాత భోజనం చేసి ఆ తర్వాత నిద్రపోవాలని అంటున్నారు. రెగ్యులర్గా మద్యం సేవించేవారు తగిన మోతాదులో ఆహారంతో పాటు నీటిని కచ్చితంగా తీసుకోవాలని వైద్యశాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. అయితే సాధ్యమైనంతవరకు మద్యానికి దూరంగా ఉండటమే బెటర్ అని సూచిస్తున్నారు.