Alcohol: మద్యం తాగితే ఆరోగ్యానికి హానికరమని తెలిసిన.. అవన్నీ పక్కన పెట్టి మరి కొందరు రోజు తాగుతుంటారు. ఇలా డైలీ తాగడం వాళ్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈరోజుల్లో అయితే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ కూడా తాగుతున్నారు. అయితే వయస్సు పెరిగే కొద్ది ముప్పు పెరుగుతుందని ఓ అధ్యయనం తెలిపింది. చాలా మంది నేను తక్కువగా మందు తాగుతా.. ఆరోగ్యానికి ఏం కాదని ఫీల్ అవుతుంటారు. అయితే ఇలా అనుకుంటే మీరు పోరపడినట్లే అని వైద్య నిపుణులు అంటున్నారు. మద్యం తాగడమే ఆరోగ్యానికి హానికరం. అలాంటిది కొంచెం తాగిన.. ఎక్కువ తాగిన ఆరోగ్యానికి హానికరమే అని నిపుణులు అంటున్నారు. మద్యాన్ని ఏ మోతాదులో తాగిన క్యాన్సర్, గుండె సమస్యలు, రక్త నాళ సమస్యలు వస్తాయి. ఈ రోజుల్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు, పురుషుల నుంచి మహిళల వరకు అందరూ కూడా మద్యానికి బానిస అవుతున్నారు. అసలు మద్యం ఏ వయస్సు వారు అధికంగా తాగుతున్నారో మరి ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
మద్యాన్ని ఎక్కువగా యుక్త వయస్సులో ఉన్నవారే సేవిస్తారు. ఎందుకంటే ఆ వయస్సులో పెద్దగా బాధ్యతల గురించి వారికి తెలియదు. ఇంతకు ముందు అయితే 20 ఏళ్ల తర్వాత యువకులు తాగేవారు. కానీ ఇప్పుడు 12 నుంచి 20 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న యువకులు ఎక్కువగా తాగుతున్నారు. వీరి తర్వాత 30 ఏళ్ల వరకు ఉన్న వారు కూడా మద్యం ఎక్కువగా సేవిస్తున్నారు. ఈ వయస్సులో ప్రేమ, పెళ్లి, బాధ్యతలు ఇలా అన్ని టెన్షన్ల వల్ల కొందరు తాగుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. పెద్దవాళ్ల కంటే చిన్న వయస్సులో ఉన్నవారే ఎక్కువగా మద్యం సేవిస్తున్నారు. పిల్లలు మద్యం సేవించకూడదు. కానీ వారే ఎక్కువగా తాగుతున్నారు. ఈ జనరేషన్‌లో ప్రేమ, బ్రేకప్, పార్టీలు అంటూ మద్యానికి ఎక్కువగా బానిస అవుతున్నారు. అందులోనూ తక్కువ తాగుతున్నారా? అంటే లేదు. తాగాల్సిన దాని కంటే ఎక్కువగా తాగుతున్నారు.
మద్యం సేవించడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా కాలేయం దెబ్బతినడం, ఊపిరితిత్తులు పనిచేయకపోవడం వంటివి జరుగుతాయి. పూర్తిగా ఆరోగ్యం క్షీణిస్తుంది. మెదడు పనితీరు తగ్గుతుంది. ఏ పని మీద సక్రమంగా పని చేయలేరు. డైలీ ఎక్కువగా తాగడం వల్ల ప్రమాదకరమైన క్యాన్సర్ వ్యాధులు బారిన పడతారు. మొత్తం బాడీ వాటర్‌తో కాకుండా ఆల్కహాల్‌తో నిండిపోతే బాడీలో బ్లడ్ శాతం కూడా తగ్గిపోతుంది. దీనివల్ల రక్తప్రసరణ సరిగ్గా జరగదు. అలాగే గుండె పోటు, స్పెర్మ్ కౌంట్ కూడా తగ్గే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తక్కువ తాగినా, ఎక్కువ తాగినా కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి మద్యం తాగడం అలవాటు చేసుకోవద్దు. అలవాటు ఉంటే ఏదో విధంగా మానేయడం ఆరోగ్యానికి మంచిది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.