Health Tips: నేలపై పడుకోవడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా.. ఆ సమస్యలకు సులువుగా చెక్!

Health Tips: మనలో చాలామంది మంచంపై నిద్రపోవడానికి ఆసక్తి చూపిస్తారనే సంగతి తెలిసిందే. మంచంపై నిద్రపోతే ఎంతో సౌకర్యవంతంగా ఉండటంతో పాటు బాగా నిద్ర పడుతుంది. ప్రస్తుత కాలంలో వేర్వేరు మోడల్స్ లో మంచాలు అందుబాటులో ఉన్నా పూర్వకాలంలో ఎటువంటి మంచాలు అందుబాటులో లేవనే సంగతి తెలిసిందే. ఆ సమయంలో పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ మంచంపైనే పడుకోవడానికి ఆసక్తి చూపేవారు. అయితే నేలపై పడుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. […]

Written By: Navya, Updated On : April 9, 2022 12:32 pm
Follow us on

Health Tips: మనలో చాలామంది మంచంపై నిద్రపోవడానికి ఆసక్తి చూపిస్తారనే సంగతి తెలిసిందే. మంచంపై నిద్రపోతే ఎంతో సౌకర్యవంతంగా ఉండటంతో పాటు బాగా నిద్ర పడుతుంది. ప్రస్తుత కాలంలో వేర్వేరు మోడల్స్ లో మంచాలు అందుబాటులో ఉన్నా పూర్వకాలంలో ఎటువంటి మంచాలు అందుబాటులో లేవనే సంగతి తెలిసిందే. ఆ సమయంలో పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ మంచంపైనే పడుకోవడానికి ఆసక్తి చూపేవారు.

అయితే నేలపై పడుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. నేలపై నిద్రపోవడం వల్ల నొప్పులు తగ్గడంతో పాటు శరీరం రిలాక్స్ అవుతుందని వైద్య నిపుణులు వెల్లడించారు. ఇలా నిద్రపోవడం వల్ల రక్తప్రసరణ సాఫీగా జరుగుతుందని శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. నేలపై పడుకోవడం వల్ల మంచి నిద్ర రావడంతో పాటు ఏ మాత్రం అలసట ఉండదు.

నేలపై నిద్రపోవడం వల్ల శరీరంపై ఒత్తిడి తగ్గి శరీరం రిలాక్స్ గా ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. దిండు లేకుండా నేలపై పడుకుంటే శరీరం మొత్తానికి ఉపశమనం కలిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. నేలపై నిద్రపోతే శరీరం ఫిట్ గా, యాక్టివ్ గా ఉండటంతో పాటు గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు అయితే తగ్గుతాయని చెప్పవచ్చు.

నేలపై పడుకోవడం వల్ల భుజాల నొప్పులు వచ్చే ఛాన్స్ ఉండదు. నేలపై నిద్రించడం ద్వారా నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. బ్యాక్ పెయిన్ సమస్యతో బాధపడే వాళ్లు నేలపై పడుకోవడం ద్వారా ఆ సమస్యను సులభంగా అధిగమించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.