https://oktelugu.com/

IPL 2022: ఐపీఎల్ కు ‘ఆర్ఆర్ఆర్’ ఎఫెక్ట్.. భారీగా పడిపోతున్న టీఆర్పీ..!

IPL 2022: బీసీసీఐ నిర్వహిస్తున్న ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్)కు క్రికెట్ అభిమానుల్లో ఎనలేని క్రేజ్ ఉంది. ఐపీఎల్ తొలి సీజన్ మొదలుకొని కరోనా కాలంలో నిర్వహించిన ఐపీఎల్ 2020, 2021 సీజన్లు సైతం సూపర్ హిట్టుగా నిలిచాయి. బ్రహ్మండమైన టీఆర్పీని దక్కించుకొని స్పాన్సర్స్, నిర్వాహకులకు కాసులవర్షం కురిపించాయి. ప్రస్తుత జరుగుతున్న ఐపీఎల్ 2022లో మొత్తం పది జట్లు పోటీపడుతున్నాయి. ఐపీఎల్ 2022 ప్రారంభానికి ముందే అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ వచ్చింది. దీంతో ఈ సీజన్ భారీ […]

Written By:
  • NARESH
  • , Updated On : April 9, 2022 / 12:46 PM IST
    Follow us on

    IPL 2022: బీసీసీఐ నిర్వహిస్తున్న ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్)కు క్రికెట్ అభిమానుల్లో ఎనలేని క్రేజ్ ఉంది. ఐపీఎల్ తొలి సీజన్ మొదలుకొని కరోనా కాలంలో నిర్వహించిన ఐపీఎల్ 2020, 2021 సీజన్లు సైతం సూపర్ హిట్టుగా నిలిచాయి. బ్రహ్మండమైన టీఆర్పీని దక్కించుకొని స్పాన్సర్స్, నిర్వాహకులకు కాసులవర్షం కురిపించాయి.

    ప్రస్తుత జరుగుతున్న ఐపీఎల్ 2022లో మొత్తం పది జట్లు పోటీపడుతున్నాయి. ఐపీఎల్ 2022 ప్రారంభానికి ముందే అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ వచ్చింది. దీంతో ఈ సీజన్ భారీ స్థాయిలో హిట్ అవుతుందని అంతా ఆశించారు. అయితే పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కన్పిస్తోంది. ఐపీఎల్ మ్యాచుల చూసేందుకు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో టీఆర్పీ దారుణంగా పడిపోతుంది.

    ఐపీఎల్ 2020, 2021 సీజన్ ను దుబాయ్ లో నిర్వహించారు. కరోనా పరిస్థితుల్లో ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించలేదు. దీంతో క్రికెట్ లవర్స్ టీవీల్లో ఐపీఎల్ మ్యాచులను చూస్తూ ఎంజాయ్ చేశారు. తద్వారా టీఆర్పీ భారీగా పెరిగి నిర్వాహాకులకు భారీగా ఆదాయం వచ్చింది. ప్రస్తుత ఐపీఎల్ 2022 సీజన్ మహారాష్ట్ర వేదికగా జరుగుతోంది.

    ఈ మ్యాచులకు ప్రేక్షకులను అనుమతిని ఇచ్చారు. పది జట్లతో ప్రారంభమైన ఐపీఎల్ 2022 తొలి వారం నుంచే చప్పగా సాగుతూ వస్తోంది. ఐపీఎల్ లో చైన్నె సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, బెంగుళూరు రాయల్స్ ఛాలెంజర్స్ జట్లకు మాత్రమే భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

    ఇందులో చైన్నె సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు వరుసగా హ్యట్రిక్ పరాజయాలను నమోదు చేశాయి. బెంగుళూరు రాయల్స్ ఛాలెంజర్స్ జట్టు మాత్రమే పర్వాలేదనిపిస్తోంది. దీంతో క్రమంగా ఐపీఎల్ టీఆర్పీ పడిపోతూ వస్తోంది. గతేడాదితో పోలిస్తే టీఆర్పీ ఏకంగా 33శాతం పడిపోగా వ్యూయర్ షిప్ 14శాతానికి పడిపోయింది.

    దీనికితోడు ఆర్ఆర్ఆర్ ఎఫెక్ట్ కూడా ఐపీఎల్ పై పడింది. దేశంలో ఇప్పుడు ఎక్కడా చూసిన ఆర్ఆర్ఆర్ మానియానే నడుస్తోంది. ఈమూవీ తెలుగుతోపాటు హిందీ, కర్ణాటక, తమిళం, మలయాళం భాషల్లో రిలీజై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. సాయంత్రం సమయంలో కుటుంబంతో కలిసి ప్రేక్షకులకు థియేటర్లకు వెళుతున్నారు.

    ఈ సమయంలోనే ఐపీఎల్ మ్యాచులు ప్రసారం అవుతుండటం టీఆర్పీ అనుకున్నంత స్థాయిలో రావడం లేదు. మరోవైపు ఐపీఎల్ మ్యాచులు సప్పగా సాగుతుండటంతో ప్రేక్షకులు ప్రత్యక్షంగా చూడటం కంటే యాప్స్ లలో అప్ డేట్స్ తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఐపీఎల్ బ్రాండ్ క్రమంగా పడిపోతుంది. ఈ సీజన్ ఇలానే కొనసాగితే మాత్రం నిర్వాహకులు భారీగా నష్టపోయే అవకాశం కన్పిస్తోంది.