Varanasi IMAX Version Glimpse: డైరెక్టర్ రాజమౌళి(SS Rajamouli) విజన్ ని పసిగట్టడం సామాన్యులకు తేలికైన విషయం కాదు. ఆయన విజన్ లో వచ్చే ఆలోచనలు, దాన్ని వెండితెర మీదకు తీసుకొచ్చే విధానం కి ఎవరైనా సెల్యూట్ చేయాల్సిందే. ఒక మనిషి ఇలా కూడా ఆలోచించగలడా అనే విధంగా రాజమౌళి విజన్ ఉంటుంది. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu) తో చేస్తున్న ‘వారణాసి'(Varanasi Movie) చిత్రం కూడా అలాంటిదే. ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ వీడియో ని రీసెంట్ గానే #Globetrotter అనే భారీ ఈవెంట్ ని రామోజీ ఫిలిం సిటీ లో ఏర్పాటు చేసి విడుదల చేశారు. ఈ వీడియో కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కానీ ఆ వీడియోలో వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే, రాజమౌళి విజన్ కి చేతులెత్తి దండం పెట్టాలి అనిపిస్తుంది. అలాంటి విజువల్స్ ని ఆయన ఇందుకోసం క్రియేట్ చేసాడో తెలిస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే.
కొన్ని సినిమాలను సాధారణ స్క్రీన్స్ లో చూస్తే కావాల్సిన థియేట్రికల్ అనుభూతి రాదు. చూడాల్సిన థియేటర్స్ లో చూస్తేనే ఆ ఫీలింగ్ కలుగుతుంది. వారణాసి చిత్రం ఆ కోవకు సంబంధించిన సినిమానే. ఈ సినిమా కాన్సెప్ట్ వీడియో లో చూపించిన లొకేషన్స్ మొత్తం ఐమాక్స్ ఫార్మటు కోసం ఎంచుకోబడినవి. ఈ విజువల్స్ ని ఐమాక్స్ ఫార్మటు స్క్రీన్ లో చూస్తే, ‘వారణాసి’ చిత్రం లోకి అడుగుపెట్టిన అనుభూతి కలుగుతుంది. అలాంటి అనుభూతిని ఇవ్వడానికి రాజమౌళి ఈసారి చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఐమాక్స్ స్క్రీన్ ఒక్కటి కూడా లేకపోవడం దురదృష్టకరం. హైదరాబాద్ లోని ప్రసాద్ మల్టీప్లెక్స్ లో లార్జ్ స్క్రీన్ ఉంది, కానీ అది ఐమాక్స్ స్క్రీన్ మాత్రం కాదు. బెంగళూరు, చెన్నై మరియు ఇతర రాష్ట్రాల్లో ఐమాక్స్ స్క్రీన్ ఉంది. అంతే కాకుండా విదేశాల్లో ఇలాంటి ఐమాక్స్ స్క్రీన్స్ సర్వసాధారణంగా ఉంటాయి.
‘వారణాసి’ చిత్రాన్ని రాజమౌళి కేవలం ఐమాక్స్ ఫార్మటు కోసం మాత్రమే కాదు, 4dX , డాళ్బీ విజన్ మరియు ఇతర ఫార్మటు స్క్రీన్స్ లో కూడా విడుదల చేసే ప్లాన్ లో ఉన్నాడు. అందుకోసం ఆయన ప్రత్యేకమైన కెమెరాలను కూడా విదేశాల నుండి తీసుకొచ్చి చేయిస్తున్నాడు. మన హైదరాబాద్ లో ప్రస్తుతానికి Epiq స్క్రీన్ ఉంది. అదే విధంగా డాళ్బీ విజన్ స్క్రీన్స్ ఉన్న మల్టీప్లెక్స్ కూడా త్వరలోనే రానుంది. వీటితో పాటు ఐమాక్స్ స్క్రీన్ కూడా త్వరలోనే రాబోతుందని అంటున్నారు. వారణాసి వచ్చే లోపు హైదరాబాద్ లో ఐమాక్స్ స్క్రీన్ ఉంటుందని, అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదని అంటున్నారు.
