ABHA Health Card: కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భవ స్కీమ్ లో భాగంగా ఆయుష్మాన్ హెల్త్ కార్డ్ లను అందిస్తుండటం గమనార్హం. ఎవరైతే ఈ హెల్త్ కార్డ్ ను కలిగి ఉంటారో వాళ్లకు కేంద్రం నుంచి 5 లక్షల రూపాయల వరకు ఆరోగ్య భీమా లభిస్తుందని చెప్పవచ్చు. ఆరోగ్యశ్రీ స్కీమ్ అమలవుతున్న ప్రతి ఆస్పత్రిలో ఈ హెల్త్ కార్డ్ చెల్లుబాటు అవుతుంది.
అర్హత ఉన్నవాళ్లు వెబ్ సైట్ ద్వారా ఈ హెల్త్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ పై https://healthid.ndhm.gov.in/ వెబ్ సైట్ ద్వారా హెల్త్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్ సైట్ లో లింక్ ను ఓపెన్ చేసి ఆ తర్వాత ఆధార్ కార్డ్ నంబర్ ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఆధార్ నంబర్ కు లింక్ అయిన మొబైల్ నంబర్ కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి.
ఆ తర్వాత సరైన వివరాలను ఎంటర్ చేసి హెల్త్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆ తర్వాత ఫోటోతో ఉన్న హెల్త్ కార్డును డౌన్ లోన్ చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఈ హెల్త్ కార్డ్ కేంద్ర ప్రభుత్వం అందించే హెల్త్ బెనిఫిట్స్ ను పొందడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. ఆధార్ కు మొబైల్ నంబర్ లింక్ అయితే మాత్రమే ఈ స్కీమ్ కు అర్హత పొందవచ్చు.
ఆయుష్మాన్ భారత్ స్కీమ్ లో చేరడం ద్వారా ఫోన్ నుంచే సులభంగా ఈ కార్డును డౌన్ లోడ్ చేసుకునే అవకాశాలు అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. కేవలం ఒకే ఒక నిమిషంలో హెల్త్ కార్డ్ పొందే అవకాశం ఉండటంతో ఈ స్కీమ్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు