https://oktelugu.com/

Ettara Jenda Song From RRR: ‘ఆర్ఆర్ఆర్’ ‘ఎత్తర జెండా’ అదిరిపోతోందట

Ettara Jenda Song From RRR: క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ నుంచి సరికొత్త అప్‌డేట్ వచ్చింది. అందులోని ‘ఎత్తర జెండా’ పాటను మార్చి 14న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అందుకు సంబంధించిన పోస్టర్‌ను ట్వీట్ చేసింది. రాంచరణ్, ఎన్టీఆర్, ఆలియా భట్ సంప్రదాయ వస్త్రాల్లో కనిపిస్తున్నారు. కాగా ఈ సాంగ్ అదిరిపోతోంది అని తెలుస్తోంది. ఈ సినిమా మార్చి 25న విడుదల కానుంది. కొద్ది రోజుల్లో ప్రమోషన్స్ ప్రారంభించనున్నారు. ఇక ఈ సినిమాలో ప్రధాన […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : March 11, 2022 / 12:48 PM IST
    Follow us on

    Ettara Jenda Song From RRR: క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ నుంచి సరికొత్త అప్‌డేట్ వచ్చింది. అందులోని ‘ఎత్తర జెండా’ పాటను మార్చి 14న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అందుకు సంబంధించిన పోస్టర్‌ను ట్వీట్ చేసింది. రాంచరణ్, ఎన్టీఆర్, ఆలియా భట్ సంప్రదాయ వస్త్రాల్లో కనిపిస్తున్నారు. కాగా ఈ సాంగ్ అదిరిపోతోంది అని తెలుస్తోంది. ఈ సినిమా మార్చి 25న విడుదల కానుంది. కొద్ది రోజుల్లో ప్రమోషన్స్ ప్రారంభించనున్నారు.

    Ettara Jenda Song From RRR

    ఇక ఈ సినిమాలో ప్రధాన హైలెట్స్ లో ఎన్టీఆర్ డైలాగ్ లే మెయిన్ హైలెట్ అవుతాయని కూడా గతంలో వార్తలు వచ్చాయి. ముఖ్యంగా తెలంగాణ యాసలో ఎన్టీఆర్ పలికే డైలాగ్ లు చాలా గొప్పగా ఉంటాయట. అన్నిటికి మించి ఎన్టీఆర్ ఈ సినిమాలో మొత్తం మూడు గెటప్స్ లో కనిపిస్తాడట. ఎన్టీఆర్ సీన్స్ అన్నీ అద్భుతంగా వచ్చేలా రాజమౌళి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడట.

    Also Read:   రాధేశ్యామ్ థియేటర్ దగ్గర ప్రమాదం.. సినిమా పై రాజమౌళి, గోపీచంద్ రియాక్షన్స్

    కొన్ని సంఘటనల కారణంగా ఓలివియా, ఎన్టీఆర్ పై ఘాడమైన ప్రేమను పెంచుకుంటుంది. చివరికీ ఎన్టీఆర్ మీద ప్రేమతోనే భారత దేశం కోసం ఆమె తన ప్రాణాలను సైతం అర్పిస్తోంది. ఓలివియా త్యాగంతో ముగిసే వీరి ట్రాక్ సినిమాలోనే హెవీ ఎమోషనల్ హైలైట్ కానుంది. ఎన్టీఆర్ – చరణ్ మొదటి సారి కలుసుకునే సన్నివేశం కూడా గూస్ బంప్స్ వస్తాయట.

    Ettara Jenda Song From RRR

    అలాగే పులితో ఎన్టీఆర్ చేసే ఫైట్ కూడా సినిమాలో మరో ప్రధాన హైలైట్ కానుంది. కాగా ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో అన్ని ఇండస్ట్రీల నుండి ఈ సినిమా పై అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి. మొత్తానికి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

    Also Read: యూపీలో ఎంఐఎం వల్ల ఎస్పీ ఘోరంగా ఓడిపోయిందా? బీజేపీ గెలిచిందా?

     

    Tags