https://oktelugu.com/

ఆ మహిళకు 31సార్లు కరోనా పాజిటివ్.. అసలేం జరిగిందంటే..?

కరోనా మహమ్మారి ఒకసారి సోకితేనే ఆ మహమ్మారి వల్ల నెలల పాటు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అయితే ఒక మహిళకు మాత్రం ఏకంగా 31సార్లు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కరోనా లక్షణాలు కనిపించకపోయినా మహిళకు పరీక్షలు నిర్వహిస్తే కరోనా పాజిటివ్ నిర్ధారణ అవుతోంది. రాజస్థాన్ రాష్ట్రంలోని అప్నాఘర్‌ ఆశ్రమానికి చెందిన శారద కరోనా వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతోంది. Also Read: భాగ్యనగర వాసులకు శుభవార్త… 57 ఉచిత వైద్య పరీక్షలు..? ఒకే మహిళకు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 23, 2021 / 01:29 PM IST
    Follow us on

    కరోనా మహమ్మారి ఒకసారి సోకితేనే ఆ మహమ్మారి వల్ల నెలల పాటు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అయితే ఒక మహిళకు మాత్రం ఏకంగా 31సార్లు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కరోనా లక్షణాలు కనిపించకపోయినా మహిళకు పరీక్షలు నిర్వహిస్తే కరోనా పాజిటివ్ నిర్ధారణ అవుతోంది. రాజస్థాన్ రాష్ట్రంలోని అప్నాఘర్‌ ఆశ్రమానికి చెందిన శారద కరోనా వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతోంది.

    Also Read: భాగ్యనగర వాసులకు శుభవార్త… 57 ఉచిత వైద్య పరీక్షలు..?

    ఒకే మహిళకు 31సార్లు పాజిటివ్ నిర్ధారణ కావడం వింత అని శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. శారద ప్రస్తుతం భరత్‌పూర్‌ జిల్లాలోని ఆర్‌బీఎం ఆస్పత్రిలో కరోనా వైరస్ కు చికిత్స చేయించుకుంటున్నారు. 2020 సంవత్సరం ఆగష్టు నెల 20వ తేదీన మహిళకు తొలిసారి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని సమాచారం. అప్పటినుంచి ఇప్పటివరకు 31సార్లు కరోనా పరీక్షలు నిర్వహించగా ప్రతిసారి పాజిటివ్ నిర్ధారణ అయింది.

    Also Read: కరోనాపై పని చేయని వ్యాక్సిన్.. 12,000 మందికి పాజిటివ్..?

    కరోనా సోకిన తొలిసారి శారద నిల్చోవడానికి కూడా ఇబ్బంది పడ్డారని ప్రస్తుతం పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే కరోనా సోకినా ఆమె ఈ మధ్య కాలంలో ఏకంగా 8 కిలోల బరువు పెరగడం గమనార్హం. ఈమె ఆయుర్వేద, హోమియోపతి, అల్లోపతి వైద్యం కూడా చేయించుకున్నారని తెలుస్తోంది. మహిళ కడుపులో కరోనా వైరస్ ఆనవాళ్లు ఉండటం వల్లే ఈ విధంగా జరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

    మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం

    ఒకసారి వైరస్ శరీరంలోకి వచ్చిన తరువాత నెలల పాటు శరీరంలో వైరస్ ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనా గురించి వెలుగులోకి వస్తున్న కొత్త విషయాలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి.