వరుస వివాదాలకు కేరాఫ్ గా నిలుస్తున్న చంద్రబాబు నాయుడు మరో కేసులో చిక్కుకున్నారు. ప్రభుత్వ పాలనపై అనవసరపు రాద్దాంతంగా చేస్తున్న చంద్రబాబు నాయుడు.. రోజురోజుకు వివాదాలకు నిలయంగా మారుతున్నారు. ప్రజలను, కార్యకర్తలను రెచ్చగొట్టి.. కేసుల్లో ఇరుక్కునేలా చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులపై వరుసగా దాడులు నిర్వహిస్తూ.. గూండాగిరిని చలాయిస్తున్నారు. ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు.. దేవుడి విగ్రహాల ధ్వంసం వెనక ప్రధాన సూత్రదారిగా చంద్రబాబు నాయుడు ఉన్నాడన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే వెనకుండి అంతా నడిపిస్తూ… కార్యకర్తలతో వైసీపీ నాయకులపై దాడులు చేయిస్తున్నారు.
Also Read: బీజేపీతో పొత్తుపై స్పందించిన పవన్..
విజయనగరం జిల్లాలో ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం కోదండ రామస్వామి ఆలయంలోకి ప్రవేశించిన గుర్తు తెలియని దుండగులు శ్రీరాముడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆలయ తాళాలు పగలగొట్టి.. శ్రీరాముడి విగ్రహ శిరస్సును తొలగించి ఎత్తుకెళ్లారు. దేవస్థాన అర్చకుడు ప్రసాద్ రోజువారిలాగే స్వామివారికి నిత్య కైంకర్యాలు సమర్పించేందుకు పైకి వెళ్లి చూడగా విగ్రహం ధ్వంసమైనట్లు గుర్తించి తోటి సిబ్బందికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఇదీ దుమారం రేపింది. అయితే తర్వాత చంద్రబాబు, విజయసాయిరెడ్డి పోటాపోటీగా రామతీర్థం సందర్శించేందుకు వెళ్లారు. ఆ సమయంలో విజయసాయిరెడ్డి కారుపై దాడి జరిగింది.
ఈ దాడి ఘటనలో పోలీసులు కోర్టుకు రిమాండ్ రిపోర్టు అప్పగించారు. ఇందులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేరును సైతం నమోదు చేశారు. ఏ1 ముద్దాయిగా.. చంద్రబాబు నాయుడు.. ఏ2గా అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావుతో పాటు మరో 12 మందిని ముద్దాయిలు చేర్చుతూ.. పోలీసులు కోర్టుకు రిపోర్టు చేశారు. కాగా ఈ కేసులో ఇప్పటికే ఏడుగురికి కోర్టు రిమాండ్ విధించింది.
Also Read: అమ్మ ఒడిని మించిన పథకం తెస్తున్న సీఎం జగన్
రామతీర్థం రాళ్లదాడికి ప్రధాన కారణంగా చంద్రబాబు నాయుడేనని పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ఏ1 గా చంద్రబాబు నాయుడు, ఏ2గా అచ్చెన్నాయుడు, ఏ3గా కళా వెంకట్రావుపై నెల్లిమర్ల పోలీసు స్టేషన్లో కేసులు నమోదు చేశారు. రామతీర్థం కొండపైకి వెళ్లి దిగివస్తున్న నేపథ్యంలో అతడి కారుపై కొంతమంది ఆందోళన కారులు చెప్పలు, వాటర్ ప్యాకెట్లు విసిరారు. రాయి తగిలి వాహనం ముందుభాగం ధ్వంసమైన విషయం తెలిసిందే.. అయితే ఈ ఘటనపై విజయసాయి రెడ్డి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. చంద్రబాబును ఏ1గా పేర్కొన్నారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్