https://oktelugu.com/

Spousal relationship: ప్రేమించి పెళ్లాడాడు.. అయినా భార్య వదిలేసి వెళ్లిపోయింది.. కారణమిదే

Spousal relationship: సంసారం అన్నాక ఈదాల్సిందే.. ఆ సాగరం దాటాలంటే కష్టసుఖాలు పంచుకోవాలి..కానీ ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్న ఈ జంటది మున్నాళ్ల ముచ్చటైంది. కారణం ఒక్కటే భర్తకు అనారోగ్యం. ఎవరు సాకాలని భార్య వదిలేసి వెళ్లిపోయింది. తాజాగా భర్త పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ అరుదైన కేసు వివరాలు బయటకు పొక్కాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య.. తను అనారోగ్యంతో ఉన్నానని వదిలేసి వెళ్లిపోయిందని గుంటూరుకు చెందిన బాధితుడు సోమవారం అర్బన్ స్పందనలో […]

Written By:
  • NARESH
  • , Updated On : January 11, 2022 / 11:26 AM IST

    Spousal relationship

    Follow us on

    Spousal relationship: సంసారం అన్నాక ఈదాల్సిందే.. ఆ సాగరం దాటాలంటే కష్టసుఖాలు పంచుకోవాలి..కానీ ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్న ఈ జంటది మున్నాళ్ల ముచ్చటైంది. కారణం ఒక్కటే భర్తకు అనారోగ్యం. ఎవరు సాకాలని భార్య వదిలేసి వెళ్లిపోయింది. తాజాగా భర్త పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ అరుదైన కేసు వివరాలు బయటకు పొక్కాయి.

    Spousal relationship:

    ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య.. తను అనారోగ్యంతో ఉన్నానని వదిలేసి వెళ్లిపోయిందని గుంటూరుకు చెందిన బాధితుడు సోమవారం అర్బన్ స్పందనలో ఫిర్యాదు చేశాడు. ఆమె తన వెంట తీసుకెళ్లిన తన కుమార్తెను అప్పగించాలని కోరాడు.

    2001లో ఓ ఫైనాన్స్ కన్సల్టెంట్ కంపెనీ పెట్టి వ్యాపారం చేశాడు భర్త. ఆ సమయంలో పరిచయమైన ఓ మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక పాప కూడా జన్మించింది.

    Also Read:  విరాట్ కోహ్లీని చూసి ఫ్యాన్స్ షాక్.. ఆ వీడియోలో ఏముంది?

    ఇక భర్త మంచి ఫైనాన్సియర్ కావడంతో ఆయన పేరు చెప్పి తన తమ్ముడికి ఏకంగా రూ.48 లక్షల రుణం ఇప్పించింది భార్య. దాన్ని అతడు చెల్లించలేదు.

    ఈ క్రమంలోనే భర్తకు 2013లో పక్షవాతం వచ్చింది. దీంతో ఏ వ్యాపారం చేయలేకపోయాడు. మంచానికే పరిమితమయ్యాడు.

    ఇదే సమయంలో భార్య ఓ ప్రభుత్వ శాఖలో పనిచేస్తోంది. 2016లో వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉంటూ కుమార్తెను తీసుకొని వెళ్లిపోయింది. నన్ను చూసుకోవడానికి నా అనే వాళ్లు లేరని.. నాకు ఆత్మహత్య చేసుకోవాలని ఉందని బాధితుడు వాపోయాడు. ఆమెతో విడాకులు ఇప్పించి నా కుమార్తెను ఇప్పించాలని కోరుతున్నాడు. అధికారులు ఫిర్యాదు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

    Also Read:  అకీరాకి కరోనా పాజిటివ్.. పవన్ సాయం నిరాకరించిన రేణూ దేశాయ్ ! కారణమిదే