https://oktelugu.com/

Debt : అప్పులపాలు కాకుండా కాపాడే అద్భుత సూత్రం

Debt : ఇటీవల కాలంలో అప్పుల భారం పెరుగుతోంది. అందరికి ఆర్థిక ఇబ్బందులు పెరుగుతున్నాయి. ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఎంత సంపాదించినా ఇంట్లో డబ్బు నిలవడం లేదు. దీంతో కుటుంబ పరిస్థితి అడకత్తెరలో చిక్కిన పోక చెక్కలా మారుతోంది ప్రస్తుత కాలంలో చేతిలో డబ్బు లేకపోతే కష్టాలే.మనకు అప్పుల బాధలు పెరగకుండా ఉండాలంటే కొన్ని పద్ధతులు పాటించాలి. చిన్న చిన్న ఉపాయాలే మనల్ని రక్షిస్తాయి. చిన్న పిల్లల ముందు.. చిన్న పిల్లలతో మన అప్పుల విషయాలు […]

Written By:
  • Srinivas
  • , Updated On : April 9, 2023 8:24 am
    Follow us on


    Debt :
    ఇటీవల కాలంలో అప్పుల భారం పెరుగుతోంది. అందరికి ఆర్థిక ఇబ్బందులు పెరుగుతున్నాయి.
    ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఎంత సంపాదించినా ఇంట్లో డబ్బు నిలవడం లేదు. దీంతో కుటుంబ పరిస్థితి అడకత్తెరలో చిక్కిన పోక చెక్కలా మారుతోంది ప్రస్తుత కాలంలో చేతిలో డబ్బు లేకపోతే కష్టాలే.మనకు అప్పుల బాధలు పెరగకుండా ఉండాలంటే కొన్ని పద్ధతులు పాటించాలి. చిన్న చిన్న ఉపాయాలే మనల్ని రక్షిస్తాయి.

    చిన్న పిల్లల ముందు..

    చిన్న పిల్లలతో మన అప్పుల విషయాలు చర్చించకూడదు. మనకు వచ్చే డబ్బుల గురించి మాట్లాడకూడదు.వారి ఎదుట వచ్చే డబ్బులు, పోయే డబ్బుల గురించి డిస్కస్ చేయకపోవడమే మంచిది. ఇలా చేస్తేవారికి చదువుపై శ్రద్ధ ఉండదు. మా తల్లిదండ్రులు ఇంత బాధపడుతున్నారా? అని వారికి చదువుపై చొరవ తీసుకోరు. ఈ నేపథ్యంలో చిన్న పిల్లల ముందు జాగ్రత్తగా ఉండాలి.

    పిల్లలకు ఆన్ లైన్ చెల్లింపులు చెప్పకూడదు

    పిల్లలతో ఆన్ లైన్ చెల్లింపుల గురించి అవగాహన పెంచకూడదు. అలా చేస్తే మనకు తెలియకుండా వారు ఏదేదో చేస్తే మనకు బిల్లులు వస్తాయి. దీంతో మనం అప్పుల భారం మోయాల్సి వస్తుంది. అందుకే వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగం గురించి కూడా చెప్పకూడదు. ఇలా చేస్తే మనం అప్పుల్లో కూరుకుపోవడం ఖాయం.

    మధ్యవర్తిత్వం వద్దు

    ఎప్పుడు కూడా మధ్యవర్తిత్వం వహించొద్దు. పొరపాటున కూడా ఎవరికైనా డబ్బుల విషయంలో ష్యూ
    రిటీ ఇచ్చారా? అంతే సంగతి. వారు కట్టకపోతే ఆ భారం మన మీద పడుతుంది. దీంతో మనం జాగ్రత్తగా ఉండకపోతే అప్పుల్లో పడిపోవడం గ్యారెంటీ. ఈ నేపథ్యంలో ఎప్పుడు కూడా మధ్యవర్తిగా ఉండి సంతకం పెట్టడం సబబు కాదు. ఇలా చేయడం వల్ల అప్పుల్లో కూరుకుపోతాం.

    Tags