https://oktelugu.com/

Lose Weight : చలికాలంలో సులభంగా బరువు తగ్గించే 6 ఆహారాలు

ప్రతి ఒక్కరు బరువు సమస్యతో బాధపడుతున్నారు. చిన్నవారి నుంచి పెద్దవారి వరకు కూడా ఈ బరువు సమస్య వేధిస్తుంది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : December 6, 2024 / 04:11 PM IST

    Lose Weight

    Follow us on

    Lose Weight :  ప్రతి ఒక్కరు బరువు సమస్యతో బాధపడుతున్నారు. చిన్నవారి నుంచి పెద్దవారి వరకు కూడా ఈ బరువు సమస్య వేధిస్తుంది. కొందరు తక్కువ బరువు ఉంటే కొందరు ఉండాల్సిన దానికంటే ఎక్కువ బరువు ఉంటారు. మారుతున్న జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారాల వల్ల బరువు సమస్య కామన్ గా కనిపిస్తుంది. అధిక బరువుతో బాధ పడుతూ జిమ్ లకు, వాకింగ్, జాగింగ్ అంటూ తెగ కష్టపడుతున్నారు. ఇక వింటర్ లో వాకింగ్, జాగింగ్ కుదరదు. పని చేయాలంటే అసలు నచ్చదు. శారీరక శ్రమ ఉండదు కాబట్టి బరువు పెరిగే అవకాశం మరింత ఎక్కువ ఉంటుంది. అందుకే కాస్త ఆహారాలు సరిగ్గా తీసుకోవాలి. బరువు తగ్గించే ఆహారాలు కూడా ఉంటాయి. వాటిని తీసుకోవడం వల్ల మీ శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. మరి అవేంటంటే?

    అల్లం: అల్లం జీవక్రియను పెంచుతుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. కొవ్వును కాల్చడాన్ని ప్రోత్సహిస్తుంది. ఇందులో ఉండే వార్మింగ్ లక్షణాలు చలికాలంలో కడుపు ఉబ్బరాన్ని తగ్గించి క్యాలరీల బర్నింగ్‌ని పెంచుతాయి. అందుకే అల్లాన్ని మీ ఆహారంలో చేర్చుకోవాలి అంటున్నారు నిపుణులు. దాల్చిన చెక్క కూడా మీ బరును నియంత్రిస్తుంది. దాల్చిన చెక్క రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది, కోరికలను తగ్గిస్తుంది. ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా పొత్తికడుపు ప్రాంతం చుట్టూ కొవ్వును కాల్చడాన్ని ప్రోత్సహిస్తుంది ఈ దాల్చిన చెక్క.

    బచ్చలికూర కూడా మీకు మంచి ఫ్రెండ్ లా ఉంటుంది. బచ్చలికూరలో కేలరీలు తక్కువగా ఉంటాయి. కానీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మీ కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచేలా చేస్తుంది. ఇందులో ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొవ్వును తగ్గించడంలో సహాయ పడతాయి. వెల్లుల్లి కూడా మీ బరువును నియంత్రిస్తుంది. వెల్లుల్లి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది. దీని సమ్మేళనాలు శరీరంలో కొవ్వు నిల్వలను తగ్గించడంలో సహాయ పడతాయి.

    బజ్రా మీకు తెలుసా? ఇది జీర్ణక్రియకు సహాయపడే తృణధాన్యం. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తూ ఆకలిని దూరం చేస్తుంది. అలా అని ఆహారం తీసుకోకుండా ఉండవద్దు. పోషకాహారం తీసుకుంటూ కాస్త తక్కువగా తినాలి. పెర్ల్ మిల్లెట్ కూడా మీ బరువును తగ్గిస్తాయి. ఎందుకంటే ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కానీ ఫైబర్ అధికంగా ఉంటుంది. గుమ్మడికాయ మిమ్మల్ని ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. ఇది జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. చల్లని నెలల్లో అతిగా తినకుండా చేస్తుంది.