Srikakulam: వైసీపీ మరో సంచలనం అంటూ ట్వీట్ పెట్టింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అనుచరుడి దందాను బయటపెట్టింది. ఉదయం నుంచి సంచలనం అంటూ ప్రచారం చేసింది వైసిపి. సరిగ్గా మధ్యాహ్నం 11:55 గంటలకు సంచలనం అంటూ చెప్పుకొచ్చింది. చివరకు మధ్యాహ్నం ఒంటిగంటకు ఈ విషయాన్ని బయట పెట్టింది. రామ్మోహన్ నాయుడు అనుచరుడు బస్వా రమణ. ఇండియన్ ఆర్మీ కాలింగ్ అనే సెంటర్ ను స్థాపించి.. ఆర్మీ,నేవీ, ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఒక్కొక్కరి నుంచి ఐదు నుంచి పదిలక్షల వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపించింది. శిక్షణ పేరుతో సెంటర్ కు వచ్చిన అమ్మాయిల గదుల్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి.. వీడియోలు రికార్డ్ చేసి.. వాటిని అడ్డుపెట్టుకొని స్నేహితులతో కలిసి అమ్మాయిలను వేధిస్తున్నట్లు తెలిపింది. సోషల్ మీడియాలో ఇది వైరల్ అంశం గా మారింది. వైసీపీ శ్రేణులు ట్రోల్ చేస్తున్నాయి కూడా..
* ఆ యువకులపై దాడి
బస్వా రమణ వీడియోలు తీస్తున్న విషయాన్ని ఓ నలుగురు యువకులు.. ఆ యువతుల ఇంట్లో చెప్పారు. దీంతో ఆ నలుగురిని బందీలుగా మార్చి చిత్రహింసలకు గురి చేసినట్లు వైసిపి ఆరోపిస్తోంది. దానికి సంబంధించి వీడియోలను సైతం జత చేసింది.మంత్రి రామ్మోహన్ నాయుడు పేరు చెప్పి బస్వా రమణ దందాలకు, బెదిరింపులకు అడ్డే లేకుండా పోయిందని చెప్పుకొచ్చింది వైసిపి. ఎన్నో ఏళ్ల నుంచి ఇలా దుర్మార్గాలకు పాల్పడుతున్నా.. అతనిపై చర్యలు లేవని చెప్పుకొచ్చింది.
* శ్రీకాకుళం ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుడు
అయితే నిన్నటి నుంచి బ్లాస్టింగ్ న్యూస్ అంటూ వైసిపి సోషల్ మీడియా ప్రచారం చేసుకుంటూ వచ్చింది. చివరకు బస్వా రమణ పేరు బయటపెట్టింది. ఈయన రామ్మోహన్ నాయుడుకే కాదు.. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ కి సైతం సన్నిహితుడిగా వైసిపి తన ట్వీట్లో పేర్కొంది. పాలన చేతకాకపోతే ఊరు రా ఇలాంటి దుర్మార్గులే రాజ్యమేలుతారు అనేదానికి ఇంతకంటే ఉదాహరణ కావాలా అని సీఎం చంద్రబాబును ట్యాగ్ చేసి అడిగింది వైసిపి. మొత్తానికి అయితే బ్లాస్ట్ న్యూస్ అంటూ పెట్టిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Truth Bomb
శ్రీకాకుళంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అనుచరుడి ఘరానా మోసం బట్టబయలు
ఇండియన్ ఆర్మీ కాలింగ్ అనే సెంటర్ను స్థాపించి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఒక్కొకరి దగ్గర నుంచి రూ.5-10 లక్షల వరకూ వసూళ్లకి పాల్పడిన బసవ రమణ
శిక్షణ పేరుతో సెంటర్… pic.twitter.com/CdcgSdJUJE
— YSR Congress Party (@YSRCParty) December 6, 2024