https://oktelugu.com/

Vijayasai Reddy: పవన్ పై ప్రశంసలు.. సడన్ గా వైసిపి యూటర్న్

పవన్ ను ఒక నాయకుడిగా కూడా గుర్తించేవారు కాదు వైసిపి నేతలు. చాలా తేలిగ్గా తీసుకునేవారు. చులకనగా మాట్లాడేవారు. అటువంటిది ఇప్పుడుచాలా గౌరవంతో మాట్లాడుతున్నారు.

Written By: , Updated On : December 6, 2024 / 04:21 PM IST
Vijayasai Reddy

Vijayasai Reddy

Follow us on

Vijayasai Reddy: నిన్నటి వరకు వారి దృష్టిలో పవన్ కళ్యాణ్ ఒక ఫెయిల్యూర్ నాయకుడు. రెండు చోట్ల ఓడిపోయిన అసమర్ధ నాయకుడు.రాజకీయ అజ్ఞాని. ప్యాకేజీ స్టార్. మూడు పెళ్లిళ్లు చేసుకున్న వాడు.. ఇలా అన్నది ఎవరో తెలుసు కదా. పవన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు వైసీపీ నేతలు . అయితే ఇప్పుడు అదే పవన్ ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇటీవల పవన్ ను ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలు, ట్వీట్స్ చూస్తుంటే వైసీపీ నేతలు అభిప్రాయాలను మార్చుకున్నట్లు కనిపిస్తోంది. వైసిపి ముఖ్య నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశిస్తూ తాజాగా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. జాతీయస్థాయిలో ఉన్న పాపులారిటీ, వయస్సును పరిగణలోకి తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని లీడ్ చేసే సామర్థ్యం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఉందంటూ విజయసాయిరెడ్డి ట్విట్ చేశారు. యువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కు 75 ఏళ్ల వ్యక్తి సారధ్యం వహించడం సరికాదంటూ పరోక్షంగా చంద్రబాబు నాయుడు పై సెటైర్లు వేశారు. ఏపీలోని ఎన్డీఏ పార్టీ నేతల్లో అత్యంత ఆదర్శనీయమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని.. రాష్ట్రానికి నాయకత్వం వహించేందుకు కూటమి పార్టీ నేతల్లో పవన్ సరైన వ్యక్తి అని నమ్ముతానంటూ సాయి రెడ్డి ఈ ట్వీట్ చేశారు.

* ఢిల్లీలోనూ అవే ప్రశంసలు
నిన్ననే ఢిల్లీ వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ప్రశంసలతో ముంచేస్తారు విజయసాయిరెడ్డి. కాకినాడ పోర్టు వాటాదారుడు నుంచి బలవంతంగా వాటాలను సేకరించారని బాధితుడు విజయసాయిరెడ్డి పై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో సిఐడి లుకౌట్ నోటీసులు జారీచేసింది. విదేశాలకు వెళ్ళిపోకుండా ఉండేందుకు ముందస్తుగా నోటీసులు ఇచ్చింది. ఈ తరుణంలోనే విజయసాయిరెడ్డి ప్రవర్తనలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. అయితే ఆయన సడన్ గా పవన్ కళ్యాణ్ భజన మొదలుపెట్టడం విశేషం.

* పేర్ని నాని సెటైరికల్ కామెంట్స్
అయితే ఒక్క విజయసాయి రెడ్డి కాదు.. మాజీ మంత్రి పేర్ని నాని సైతం పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. కాకినాడ పోర్ట్ లో రేషన్ బియ్యం అక్రమ రవాణా అడ్డుకోవడం పై పవన్ కళ్యాణ్ గురించి నాని ప్రశంసలు కురిపించారు. అయితే పేర్ని నాని వ్యాఖ్యలలో ప్రశంసలతో పాటుగా సెటైర్లు కూడా ఉన్నాయి. తన శాఖ కాకున్నా తనిఖీలు చేస్తున్న పవన్ కళ్యాణ్ ను అభినందించారు. అదే సమయంలో ఒక్క షిప్ పరిశీలనకే పరిమితం కావడాన్ని తప్పు పట్టారు. అయితే ఎప్పుడు పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై, ఆయన వ్యక్తిగత జీవితం పై మాట్లాడే వైసిపి నేతల తీరులో మార్పు రావడం విశేషం.