కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో ఆ లక్షణాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..?

దేశంలో కరోనా వైరస్ నుంచి కోలుకున్న వాళ్లను అనేక ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. కరోనా సోకిన వాళ్లలో ఎక్కువమందిలో ఊపిరితిత్తులు దెబ్బ తిన్నాయి. కరోనా నెగిటివ్ వచ్చినా పూర్తిస్థాయిలో రికవరీ కావడానికి చాలా సమయం పడుతోంది. ప్రస్తుతం దేశంలో డెల్టా వేరియంట్ కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదు కావడంతో కరోనా లక్షణాలు దీర్ఘకాలికంగా వేధిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనాతో బాధ పడేవాళ్లలో ఎక్కువమందిని శ్వాస తీసుకోలేకపోవడం అనే సమస్య వేధిస్తూ ఉంటుంది. ఈ సమస్య వల్ల […]

Written By: Navya, Updated On : August 1, 2021 12:04 pm
Follow us on

దేశంలో కరోనా వైరస్ నుంచి కోలుకున్న వాళ్లను అనేక ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. కరోనా సోకిన వాళ్లలో ఎక్కువమందిలో ఊపిరితిత్తులు దెబ్బ తిన్నాయి. కరోనా నెగిటివ్ వచ్చినా పూర్తిస్థాయిలో రికవరీ కావడానికి చాలా సమయం పడుతోంది. ప్రస్తుతం దేశంలో డెల్టా వేరియంట్ కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదు కావడంతో కరోనా లక్షణాలు దీర్ఘకాలికంగా వేధిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

కరోనాతో బాధ పడేవాళ్లలో ఎక్కువమందిని శ్వాస తీసుకోలేకపోవడం అనే సమస్య వేధిస్తూ ఉంటుంది. ఈ సమస్య వల్ల చాలామంది వెంటిలేటర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. డెల్టా వేరియంట్ వల్ల కొంతమందిని అధిక స్థాయిలో ఊపిరితిత్తులు దెబ్బతినడం లాంటి సమస్యలు సైతం వేధించే అవకాశం అయితే ఉంటుంది. కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో తీవ్ర అలసట సైతం ఎక్కువగా కనిపించే అవకాశాలు ఉంటాయి.

శరీరాన్ని హైడ్రేడ్ గా ఉండేలా చూసుకోవడంతో పాటు విశ్రాంతి తీసుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలను అధిగమించే అవకాశం అయితే ఉంటుంది. కరోనాతో పోరాడే వాళ్లలో గొంతులో మంట, బొంగురుగా మాట్లాడటం లాంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ సమస్యల నుంచి కోలుకుని సాధారణ స్థితికి రావడానికి చాలా సమయం పట్టే అవకాశం అయితే ఉంటుందని సమాచారం అందుతోంది.

కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్ అనే సమస్య చాలామందిని వేధిస్తోంది. మందులు, చికిత్స ద్వారా ఈ సమస్యలను కొంతవరకు అధిగమించే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తోంది. కరోనా ఇన్ఫెక్షన్ బాధితుల్లో కనిపించే లక్షణాల్లో ఒళ్లు నొప్పులు కూడా ఒకటి. వైద్యుల సూచలన ప్రకారం లక్షణాల తీవ్రతను బట్టి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు.