Health Tips: నీరే అన్ని ప్రాణులకు ఆధారం. నీరు తాగకుండా ఉండని జీవి లేదంటే అతిశయోక్తి కాదు. అన్నం తినకుండా ఉండగలమేమో కానీ నీరు తాగకుండా ఉండలేం. నీరు అంతటి ప్రాధాన్యత కలిగి ఉంది. దీంతో ప్రతి జీవి రోజుకు ఎంతో కొంత నీరు తాగాల్సిందే. లేదంటే ప్రాణాలుండవు. జలమే జీవజాతికి ప్రాణం పోస్తుంది. నీరు సరైన మోతాదులో తాగకపోతే శరీరం డీ హైడ్రేషన్ కు గురై ప్రాణాలు పోయిన సంఘటనలు ఉన్నాయి. వడదెబ్బ అలాంటిదే. శరీరంలో తగినంత నీరు లేకపోతే మనిషి మనుగడకే ప్రమాదం. ఇలాంటి నీరును తరుచుగా తాగుతుండాలి.
నీళ్లు ఎలా తాగాలి?
నీళ్లు తాగడానికి కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి. నీటిని ఎలా పడితే అలా తాగితే కుదరదు. వాటికి కూడా కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. దీంతో మంచినీరు తాగే విధానాలు తెలుసుకోవాలి. అన్నం తినేటప్పుడు నీళ్లు తాగకూడదు. తిన్న తరువాత గంటన్నర దాకా నీరు తాగితే మనం తిన్న పదార్థం జీర్ణం కాదు. మనం తిన్న పదార్థాలను అరిగించేందుకు పొట్టలో యాసిడ్ విడుదల అవుతుంది. అది తిన్న వాటిని అరిగిస్తుంది. కానీ మనం తింటూ నీళ్లు తాగితే యాసిడ్ తో నీళ్లు కలిసి మనం తిన్నది త్వరగా జీర్ణం కాదు. దీంతో జీర్ణ సమస్యలు వస్తాయి.
నిలబడి తాగితే..
నీళ్లు ఎప్పుడు కూడా నిలబడి తాగొద్దు. కూర్చుని తాగాలని పెద్దలు చెబుతారు. మంచినీళ్లు తాగేటప్పుడు నిలబడి ఉండకూడదు. ఎటైనా బయటకు వెళ్లి వచ్చి రాగానే నీళ్లు తాగకూడదు. ఇంకా ఎండలో తిరిగి వచ్చి కూడా చల్లని నీరు తాగితే ప్రమాదమే. కొద్దిసేపు ఆగి తరువాత తాగాలి. లేదంటే ఇబ్బందులు వస్తాయి. పరుగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మేలు అంటుంటారు. అంటే నీటికి ఎంతటి ప్రాధాన్యం ఉందో తెలుసుకోవచ్చు. నిలబడి నీళ్లు తాగితే అర్ధరైటిస్ సమస్య వచ్చే అవకాశం వస్తుంది. నిలబడి నీళ్లు తాగితే లోపల ద్రవాల సమతుల్యత దెబ్బతింటుంది. కీళ్లలో ద్రవం పేరుకుపోవడంతో అర్ధరైటిస్ వ్యాధికి దారి తీస్తుంది.
జీర్ణ వ్యవస్థకు దెబ్బ
నిలబడి నీళ్లు తాగితే కడుపుకు సంబంధించిన సమస్యలు వస్తాయి. జీర్ణ వ్యవస్థ దెబ్బ తింటుంది. పేగులను ప్రభావితం చేస్తుంది. నిలబడి నీళ్లు తాగితే దాహం తీరదు. కూర్చుని నీళ్లు తాగితే కండరాలు, నాడీ వ్యవస్థ రిలాక్స్ అవుతాయి. దీంతో ద్రవాలు, ఆహారాలు త్వరగా జీర్ణం కావడానికి నాడీ ప్రేరేపిస్తుంది. నిలబడి నీళ్లు తాగితే అన్నవాహిక దిగువ భాగంపై ప్రభావం చూపుతుంది. అన్నవాహిక మధ్య ఉమ్మడి స్ప్రింక్లర్ ను ప్రభావితం చేస్తుంది. ఇది కడుపులో చిరాకు తెప్పిస్తుంది.
మూత్ర పిండాలపై ప్రభావం
తగినంత నీరు తాగకపోతే మూత్రపిండాలపై ప్రభావం పడుతుంది. శరీరంలోని నీటిని శుభ్రపరచడానికి మూత్రపిండాలు ఉపయోగపడతాయి. నిలబడి నీళ్లు తాగితే మూత్రపిండాల సమస్య ఏర్పడుతుంది. శరీరంలోని నీటిని సరిగా కిడ్నీలు శుభ్రం చేయకపోతే మూత్ర విసర్జనలో నొప్పి వస్తుంది. అందులో మురికి పేరుకుపోవడం వల్ల మూత్రపిండాలు దెబ్బతింటాయి.
పాలు ఎలా తాగాలో తెలుసా?
నీళ్లు కూర్చుని తాగాలి. పాలు మాత్రం నిలబడి తాగాలి. పాలు నిలబడి తాగితేనే జీర్ణం అవుతాయి. పాలు తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. వాత, పిత్త దోషాలు నివారించడానికి పాలు ఉపయోగపడతాయి. నిలబడి గోరువెచ్చని నీరు తాగితే శరీరంపై సానుకూల ప్రభావం కనిపిస్తుంది. కీళ్ల నొప్పులు కూడా రాకుండా చేస్తాయి. పాలకు నీళ్లకు తేడా ఉంది. నీళ్లు కూర్చుని తాగితేనే ప్రయోజనం. పాలు నిలబడి తాగిగేతనే మేలు. దీంతో పాలు, నీళ్లకు తాగే విషయంలో రెండు తేడాలు మనకు కనిపిస్తాయి.
పాలు నిలబడే ఎందుకు తాగాలి?
పాలల్లో కాల్షియం ఉండటంతో ఎముకలు దృఢంగా మారుతాయి. దంతాలను కూడా బలోపేతం చేస్తుంది. ఆస్టియో అర్థరైటిస్ రాకుండా కాపాడతాయి. పొటాషియం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. విటమిన్ డి అసహజ కణాల పెరుగుదలను నియంత్రిస్తుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇలా పాలు తాగడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి.
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read MoreWeb Title: Health tips why drink milk while standing and drink water while sitting
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com