బీహార్‌‌ పోలింగ్ లో అనూహ్యం: ఓటర్లకు ప్రధాని కీలక సూచన

మొన్నటి వరకు కరోనా దేశాన్నే కాదు.. ప్రపంచాన్ని ఆగమాగం చేసింది. లక్షలాది మంది ప్రజలను బలితీసుకుంది. దేశాలు.. రాష్ట్రాలు ఆర్థిక వ్యవస్థతో ఛిన్నాభిన్నం అయ్యాయి. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఎక్కడ కూడా ఎన్నికలు జరగలేదు. కానీ.. మొదటిసారి భారత్‌లోని బీహార్‌‌ రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. Also Read: ప్రతిపక్షం ఎవరో దుబ్బాక డిసైడ్ చేస్తుందా? 71 స్థానాలకు నేడు పోలింగ్‌ జరుగుతోంది. కోవిడ్- జాగ్రత్తలు తీసుకుంటూ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అయితే బీహర్ ప్రజలు ఓటు హక్కు […]

Written By: NARESH, Updated On : October 28, 2020 12:19 pm
Follow us on

మొన్నటి వరకు కరోనా దేశాన్నే కాదు.. ప్రపంచాన్ని ఆగమాగం చేసింది. లక్షలాది మంది ప్రజలను బలితీసుకుంది. దేశాలు.. రాష్ట్రాలు ఆర్థిక వ్యవస్థతో ఛిన్నాభిన్నం అయ్యాయి. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఎక్కడ కూడా ఎన్నికలు జరగలేదు. కానీ.. మొదటిసారి భారత్‌లోని బీహార్‌‌ రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

Also Read: ప్రతిపక్షం ఎవరో దుబ్బాక డిసైడ్ చేస్తుందా?

71 స్థానాలకు నేడు పోలింగ్‌ జరుగుతోంది. కోవిడ్- జాగ్రత్తలు తీసుకుంటూ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అయితే బీహర్ ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్రమోడీ కోరారు. కరోనా వైరస్ కోసం తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఓటేయాలని విన్నవించారు.

బీహార్‌‌ పోలింగ్‌ మొదలైన తొలి గంటలో కేవలం 5 శాతం మాత్రమే పోలింగ్‌ శాతం నమోదైంది. తర్వాత మరో గంటకు అంటే ఉదయం 9 గంటల వరకు 6.03 శాతం ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో ఓటింగ్ శాతం తగ్గే ప్రమాదం ఉందని ప్రధాని మోడీ భావించారు. ఓటు హక్కు వినియోగించుకొని.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరారు.

Also Read: తెలుగు రాష్ట్రాలకు మంచి రోజులు

నేడు ఎన్నికలు జరుగుతున్న 71 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1.01 కోట్ల మంది మహిళలు ఉన్నారు. 599 మంది థర్డ్ జెండర్ ఉన్నారు. ఆర్జేడీ నుంచి 42 మంది, జేడీయూ నుంచి 35 మంది, బీజేపీ 29 మంది, 21 కాంగ్రెస్, 8 మంది లెప్ట్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇతరులతో కలిపి మొత్తం 1066 మంది పోటీలో నిలిచారు. వచ్చేనెల 3వ తేదీన రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. 7న మూడో విడత ఎన్నికలతో ఈ పోలింగ్ ప్రక్రియ ముగియనుంది. వచ్చేనెల 10వ తేదీన ఓట్లు లెక్కించనున్నారు. 11 గంటల వరకు దాదాపు ఎవరి విజయమో ఖాయం అయిపోతుంది.