Homeగెస్ట్ కాలమ్తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో భూకంపం.. ఎందుకొస్తుందంటే?

తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో భూకంపం.. ఎందుకొస్తుందంటే?

భూకంపం.. వామ్మో ఆ మాట వింటేనే ఎవరికైనా వెన్నులో వణుకు పుడుతుంది. భూకంపం మాట వినడమే కానీ అది ఎలా పుడుతుందో ఎవరికీ తెలియదు. ఎప్పుడు ఏ చోట వస్తుందో అంతకన్నా ఊహించలేం. దానికి ఆ ప్రాంతం.. ఈ ప్రాంతం అంటూ తేడా లేదు. భూకంపం వచ్చిందంటే చాలు అందరూ వణికిపోవాల్సిందే. ప్రకృతి కన్ను తెరిచి విలయతాండవం చేస్తుంది. భూకంప ధాటికి క్షణాల్లోనే అల్లకల్లోలం అయిపోతుంది. అసలు భూకంపం ఎందుకు వస్తుంది..? అందుకు కారణాలు లేకపోలేదు. కానీ సమాజంలో మాత్రం భూకంపాల మీద రకరకాల కట్టుకథలున్నా.. కథలుగానే మిగిలిపోయాయి. భూకంపాలు రావడానికి శాస్త్రపరమైన కారణాలే కాక పర్యావరణానికి జరుగుతున్న అపార నష్టం కూడా చాలా కారణాలున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Also Read: ఏపీలోని ఆ జిల్లాలో సంపూర్ణ లాక్ డౌన్..?

భూకంపం అంటే.. భూమి లోపలి పొరలు తరుచుగా కదులుతుంటాయి. ఆ కదలికల వలన భూమి బీటలు వారుతుంది. బీటలు వారిన ప్రదేశం చుట్టూ శక్తి విడుదలవుతుంది. ఈ చర్య ఇలాగే కొనసాగినప్పుడు వాటి మధ్య ఒత్తిడి అధికమై ఆ శక్తి పైకి ఎగదన్నుతూ వస్తుంటుంది. ఆ క్రమంలో భూమి లోపలి రాళ్లు బీటలు వారతాయి, బీటలు వారినప్పుడు ఏర్పడిన ఖాళీల్లోంచి విడుదలైన శక్తి భూమి ఉపరితలానికి కంపనాల రూపంలో వస్తుంది. ఆ కంపనాలనే భూకంపంగా వ్యవహరిస్తాం. భూకంపాలు సంభవించినప్పుడు భూమి ఉపరితల ప్రకంపనలే కాకుండా భూమి విచ్ఛిన్నమవుతుంది. భూ ఉపరితలానికి దాదాపు 10 కిలోమీటర్ల లోతు నుంచి 800 కిలోమీటర్ల లోతు వరకు ఇవి సంభవిస్తాయి.

…….అయితే ఎక్కడైనా ఏడాదిలో పది సార్లకు మించి భూకంపాలు రావని భావిస్తుంటాం. కానీ.. ఆంధ్రప్రదేశ్‌–తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో మాత్రం గత తొమ్మిది నెలల్లోనే ఏకంగా 1545 సార్లు భూప్రకంపనలు వచ్చాయి. ఒక్కసారిగా ధబేల్ అంటూ వచ్చే శబ్దాలు.. కంపిస్తున్న భూమి.. దీంతో ఏపీ–తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు గ్రామాల ప్రజలు భయపడుతున్నారు. దీంతో బిల్డింగులకు పగుళ్లు ఏర్పడ్డాయి. ప్రభుత్వ భవనాలు, ప్రైవేటు ఆస్తులకూ నష్టం జరుగుతోంది. అయితే.. ఈ భూకంపాలకు కేంద్ర స్థానం ఒకే ఊరు కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వినడానికి ఆశ్చర్యకరంగానే ఉన్నా అదే నిజం. ఈ భూకంపాలన్నింటికీ కారణం సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం వెల్లటూరు గ్రామమని అంటున్నారు పరిశోధకులు. ఇంతకీ ఆ వెళ్లటూరులో ఏం జరుగుతోంది? అక్కడి ప్రజలు ఏమంటున్నారు?

వర్షం వచ్చిందంటే.. అంతటా ఉరుములు మెరుపులు వస్తాయి. కానీ.. ఇక్కడ భూమి ప్రకంపనలు వస్తున్నట్లు ఆ గ్రామ వాసులు అంటున్నారు. గతేడాది డిసెంబర్‌‌ నుంచి ఈ ప్రకంపనలు పెరిగాయని అంటున్నారు. పగలూ రేయి అనకుండా పూర్తి భయంతో గడుపుతున్నామని ఆవేదన చెందుతున్నారు. పిడుగు వచ్చినంత సౌండ్‌తో కింది నుంచి పైకి వస్తున్నట్లు చెబుతున్నారు. ఎప్పుడు గుడిసెలు పడిపోతాయో కూడా తెలియని పరిస్థితి. అన్నం తినే టైంల కూడా భూమి భయపెడుతుండడంతో ఉరుకులు పరుగులు పెడుతున్నారు అక్కడి జనం.

భూప్రకంపనలకు తోడు భూమిలో నుంచి పెద్దపెద్ద శబ్దాలు కూడా వస్తుండటంతో ప్రజలు.. ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలు భయపడిపోతున్నారు. ఈ భూప్రకంపనలకు ఇంట్లో పైన పెట్టిన గిన్నెలు, డబ్బాలు, ఇతర వస్తువులు కిందపడిపోతున్నాయి. భూమిలో నుంచి వచ్చే భయానక శబ్దాలతో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. రాత్రిపూట ఇళ్లలో పడుకోవడానికి భయపడుతున్నారు. రాత్రుళ్లు ఇళ్లలో ఎవరో ఒకరు మెలకువగా ఉంటూ జాగ్రత్త పడుతున్నారు. ఈ చింతలపాలెం మండలంలోనే ఆరేడు నెలలుగా ప్రతీరోజూ భూమి కంపిస్తూనే ఉంది. ఈ భూకంపం భయంతో ఎవరూ ఏ పనులు చేసుకోలేకపోతున్నామని చెబుతున్నారు.

ఈ భూకంపం తీవ్రత తెలుగు రాష్ట్రాల్లోని సూర్యాపేట, నల్లగొండ, ఖమ్మం జిల్లాలతోపాటు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ వరకు, తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని నందిగామ, అమరావతి ప్రాంతాల వరకు విస్తరించిందని శాస్త్రవేత్తలు వివరించారు. భూగర్భ శాస్త్రవేత్త నగేష్‌ మాట్లాడుతూ.. ఇటీవల భూకంపం రిక్టర్‌ స్కేల్‌పై 4.6గా నమోదవగా 30ఏళ్లలో ఇంత పెద్ద ఎత్తున భూకంపం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా నమోదు కాలేదని గుర్తించినట్లు తెలిపారు. ఈ ఏడాది జనవరి 13 నుంచి ఈనెల 26వ తేదీ వరకు సుమారు 300 సార్లు చిన్నచిన్న భూకంపాలు వచ్చినట్లు రిక్టర్‌ స్కేల్‌ ద్వారా గుర్తించామన్నారు. కృష్ణపట్టెలోని సున్నపురాయి, ఇసుక రాయి ప్రాంతాల్లోని భూమి లోతుల్లో ఇంత పెద్ద భూకంపం రావడం ఇదే ప్రథమం కావడంతో అధ్యయనం చేస్తున్నట్లు పేర్కొన్నారు. మరో రెండు వారాల పాటు భూకంపం తాలూకు ప్రకంపనలపై అధ్యయనం చేస్తామని వివరించారు. అదేవిధంగా భువనగిరి పట్టణంలోని జలీల్‌పుర, విద్యానగర్‌, గాంధీనగర్‌ తదితర ప్రాంతాల్లో రెండు సెకన్ల పాటు భూమి కంపించినట్టు స్థానికులు తెలిపారు.

Also Read: జేసీ దివాకర్ రెడ్డికి జగన్ సర్కార్ బిగ్ షాక్..?

ఈ భూక్రంపనలను రికార్డు చేసేందుకు ఎన్‌జీఆర్ఐ అధ్వర్యంలో చింతలపాలెం మండలంలోని దొండుపాడు ప్రభుత్వ పాఠశాలలో, పాత వెల్లటూరులో భూకంప నమోదు కేంద్రాలను ఏర్పాటు చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చింతలపాలెం నుంచి సుమారు 100 కిమీ పరిధిలో తరచుగా భూప్రకంపనలు వస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే వీటిని ఆపేందుకు ఎటువంటి పరిష్కారం లేనందున ప్రజలు అప్రమత్తంగా ఉండక తప్పదని చెపుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని బొరబండ ఏరియాలోనూ వరుస భూకంపాలు రావడం ఆందోళన కలిగించింది. మూడు రోజుల్లో రెండు సార్లు భారీ శబ్దాలతో భూకంపాలు వచ్చాయి. అక్కడి స్థానికులు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చింది.

పాత వెల్లటూరు ప్రాంతంలో భూ పొరల్లో వీక్‌ జోన్‌ ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. భూమిలో ఏర్పడ్డ పగుళ్ల కారణంగా.. భూమిలోని రాళ్ల పొరలు బలహీనంగా ఉండడం కారణంగా భూకంపం వస్తోందని చెబుతున్నారు. పగుళ్లు ఉన్నట్లు గుర్తించామని, ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని చెప్పారు. కాగా, ఈ ప్రాంతంలో మొదటి సారి జనవరి 10న భూకంపం రాగా, జనవరి 12న ఎన్‌ఆర్‌జీఐ శాస్త్రవేత్తలు చింతలపాలెం మండలంలో పర్యటించారు. అక్కడి కారణాలను పరిశోధించారు. ఇదంతా జరిగి ఎనిమిది తొమ్మిది నెలలు గడుస్తున్నా ఇంతవరకు అక్కడ చర్యలు తీసుకున్నది లేదు.

-శ్రీనివాస్.బి

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

3 COMMENTS

Comments are closed.

Exit mobile version