తెలంగాణలో టీఆర్ఎస్ కార్యకర్తలో మావోయిస్టులు హత్య చేశారు. ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలం బోదాపురంనకు చెందిన మాడూరి భీమేశ్వర్ ఇంటికి అర్ధరాత్రి మావోయిస్టులు వచ్చి దారుణంగా హత్య చేసి ఓ లేఖను వదిలివెళ్లారు. స్థానికంగా మందుల వ్యాపారం నిర్వహిస్తున్న భీమేశ్వర్రావుకి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. ఈ సంఘటనతో జిల్లాలో కలకలం రేపింది. కొంత కాలంగా మావోయిస్టులు, పోలీసుల మధ్య వార్ జరుగుతోంది. మావోయిస్టులు సంచరిస్తున్నారనే నెపంతో ఉత్తర తెలంగాణలో పోలీసులు విస్తృతంగా అడవులు జల్లెడ పడుతున్నారు. ఇటీవల వెంకటాపురంలో డీజీపీ, సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు పర్యటించారు.