కర్ర విరగలేదు.. పామును చంపిన కేసీఆర్?

తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థనే సీఎం కేసీఆర్ ఎత్తేశారు. సమూలంగా ప్రక్షాళన చేశారు. అవినీతితో భ్రష్టుపట్టిన ఆ శాఖను నామరూపాల్లేకుండా చేశారు. అవినీతి ఆరోపణలు ఉన్న వీఆర్వోలను వేరే శాఖలకు మార్చారు. నిజానికి ఇలాంటివి ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యతిరేకతకు కారణం అవుతాయి. వారంతా ప్రభుత్వంపై సమ్మె చేయడమో లేక.. వ్యతిరేకంగా మారి ఓడించడమో చేస్తారు. Also Read: కొండగట్టు ఘటనకు రెండేళ్లు.. తండ్రి సమాధి వద్దే కూతురు కానీ కేసీఆర్ ఇదంతా ముందే తెలుసు.. అందుకే పకడ్బందీగా ముందుకెళ్లాడు. […]

Written By: NARESH, Updated On : September 13, 2020 10:26 am
Follow us on

తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థనే సీఎం కేసీఆర్ ఎత్తేశారు. సమూలంగా ప్రక్షాళన చేశారు. అవినీతితో భ్రష్టుపట్టిన ఆ శాఖను నామరూపాల్లేకుండా చేశారు. అవినీతి ఆరోపణలు ఉన్న వీఆర్వోలను వేరే శాఖలకు మార్చారు. నిజానికి ఇలాంటివి ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యతిరేకతకు కారణం అవుతాయి. వారంతా ప్రభుత్వంపై సమ్మె చేయడమో లేక.. వ్యతిరేకంగా మారి ఓడించడమో చేస్తారు.

Also Read: కొండగట్టు ఘటనకు రెండేళ్లు.. తండ్రి సమాధి వద్దే కూతురు

కానీ కేసీఆర్ ఇదంతా ముందే తెలుసు.. అందుకే పకడ్బందీగా ముందుకెళ్లాడు. కొత్త రెవెన్యూ చట్టం రూపుదాల్చే వేళ కీసర తహసీల్దార్ తోపాటు మెదక్ అడిషనల్ కలెక్టర్ ను ఏకంగా 1.10 కోట్ల చొప్పున లంచం తీసుకుంటూ ఇరుక్కుపోయారు.

అయితే ఈ ఇద్దరు అధికారులు ఏసీబీకి పట్టుబడడం వెనుక కేసీఆర్ స్కెచ్ ఉందన్న ఊహాగానాలు సచివాలయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన వేళ ఉద్యోగులు, ప్రజలు, రాజకీయ పార్టీ నేతల్లో వ్యతిరేక రాకుండా ఉండేందుకు కేసీఆర్ ఇలా ఇరికించాడని.. వారి అవినీతి చూపించి తన మార్గం సుగమం చేసుకున్నాడనే టాక్ వినిపిస్తోంది.

అయితే ఇదంతా నిజమా.. వట్టి ప్రచారమా తెలియదు కానీ.. సరిగ్గా కొత్త రెవెన్యూ చట్టం వేళనే ఆ ఇద్దరు అధికారులు ఏసీబీకి భారీ లంచాలతో పట్టుబడడం చర్చనీయాంశమైంది.

Also Read: మలిసంధ్యలో.. మరిచి‘పోలేని’ వేదన

కేసీఆర్ కు ఇప్పుడు రైతులనే బలమైన ఓటు బ్యాంకు ఉంది. ఉద్యోగులు కేవలం లక్షల్లోనే ఉంటారు. అందుకే మెజార్టీ రైతులకు మేలు చేసేందుకు కేసీఆర్ ఉద్యోగ వ్యవస్థను ప్రక్షాళన చేసేస్తున్నారు. వారిని అస్సలు పరిగణలోకి తీసుకోవడం లేదు అన్న చర్చ సాగుతోంది.

ఉమ్మడి ఏపీలో 2004కు ముందు ఉద్యోగులతో పెట్టుకున్న నాటి సీఎం చంద్రబాబు ఓడిపోయాడు. కానీ కేసీఆర్ మాత్రం వ్యూహాత్మకంగా వారిని విలన్స్ చేస్తూ కాగల కార్యం చేసుకుంటున్నారనే చర్చ అధికార వర్గాల్లో జోరుగా సాగుతోంది.

-ఎన్నం