https://oktelugu.com/

చినబాబుకు జగన్ పెద్ద స్కెచ్..!

జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చాక ఓవైపు ప్రజా సంక్షేమ పథకాలతో దూసుకెళుతూనే మరోవైపు ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు. టీడీపీ హయాంలోని అవినీతి అక్రమాలను బయటికి తీస్తూ ఆపార్టీ నేతల్లో గుబులు రేకెత్తిస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు హయాంలో మంత్రులుగా చేసిన అచ్చెన్నాయుడు, తదితర నేతలను జైలుకి పంపించారు. మరికొందరిని కూడా జైళ్లకు పంపించేందుకు స్కెచ్ రెడీ చేస్తున్నారు. దీంతో ఎప్పుడు ఏవార్త వినాల్సి వస్తుందోనని బెంబేలెత్తిపోతున్నారు. ఇదిలా ఉంటే చిన్నబాబుకు సీఎం జగన్ భారీ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 17, 2020 4:56 pm
    Follow us on


    జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చాక ఓవైపు ప్రజా సంక్షేమ పథకాలతో దూసుకెళుతూనే మరోవైపు ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు. టీడీపీ హయాంలోని అవినీతి అక్రమాలను బయటికి తీస్తూ ఆపార్టీ నేతల్లో గుబులు రేకెత్తిస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు హయాంలో మంత్రులుగా చేసిన అచ్చెన్నాయుడు, తదితర నేతలను జైలుకి పంపించారు. మరికొందరిని కూడా జైళ్లకు పంపించేందుకు స్కెచ్ రెడీ చేస్తున్నారు. దీంతో ఎప్పుడు ఏవార్త వినాల్సి వస్తుందోనని బెంబేలెత్తిపోతున్నారు.

    ఇదిలా ఉంటే చిన్నబాబుకు సీఎం జగన్ భారీ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. మండలిలో టీడీపీ బలంగా ఉండటంతో ప్రభుత్వ బిల్లులు పాస్ చేయకుండా అడ్డుకోగలుగుతుంది. దీంతో సీఎం జగన్ మండలి రద్దు దిశగా పూనుకున్నారు. అయితే అది ఇంకా పూర్తిస్థాయిలో కాలేదు. దీంతో మండలిలో టీడీపీ నేతలను తమవైపు తిప్పుకొని వైసీపీ బలాన్ని పెంచుకుంటోంది. మరోవైపు ఎమ్మెల్సీ లోకేష్ బాబుపై అనర్హత వేటు వేసేలా పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది.

    జగన్ మంచి కోసమే ఇదంతా చేస్తున్నాడట..!

    ఇందుకు టీడీపీ గతంలో తమపై ఉపయోగించిన ఎథిక్స్ కమిటీని అస్త్రంగా ఉపయోగించాలని భావిస్తోంది. లోకేష్ పై అనర్హత వేటు వేయాలంటే బలమైన కారణం చూపించాల్సి ఉంటుంది. ఇందుకోసం బడ్జెట్ సమావేశాల్లో జరిగిన గొడవని వైసీపీ నేతలు తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారు. సభలో మంత్రులకు, టీడీపీ ఎమ్మెల్సీలకు మధ్య గొడవ జరిగినప్పుడు లోకేశ్ ఫోన్లో ఫొటోలు తీశారు. ఈ వ్యవహారం అంతా సభలోని సీసీ కెమెరాల్లో రికార్డయింది.

    శాసన మండలిలో లోకేష్ బాబు సెల్ ఫోన్లో ఫొటోలు, వీడియోలు తీయడాన్ని వైసీపీ నేతలు తప్పుబడుతున్నారు. లోకేష్ సభ నిబంధనలు ఉల్లంఘించారని వైసీపీ నేతలు అంటున్నారు. దీనిపై ఇప్పటికే లోకేశ్‌పై ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఛైర్మన్‌పై ఒత్తిడి తెచ్చి అనర్హత వేటువేసేలా వైసీపీ పావులు కదుపుతోంది. ఒకవేళ చైర్మన్ చిన్నబాబుపై చర్యలు తీసుకుంటే టీడీపీ మండలిలో గట్టి ఎదురుదెబ్బ ఖాయమని వైసీపీ అంచనా వేస్తోంది.

    పట్టుబడిన నగదు బాబుదే నంట..

    ఇప్పటికే మండలిలో వైసీపీ తన బలాన్ని పెంచుకుంటూ పోతుంది. టీడీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్సీలు ఇప్పటికే వైసీపీ మద్దుతు తెలిపారు. తాజాగా చినబాబుపై అనర్హత వేటుపడితే మరికొంతమంది వైసీపీలో చేరడం ఖాయమని వైసీపీ నేతలు అంటున్నారు. ఓవైపు చినబాబుకు చెక్ పెడుతూనే మరోవైపు మండలిలో టీడీపీని మరింత బలహీనం చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళుతుంది. దీంతో మండలి రాజకీయం మరింత రసవత్తరంగా మారడం ఖాయంగా కన్పిస్తుంది.

    Tags