సిద్దరామయ్యతో యడియూరప్ప లాలూచి!

బొటాబొటి మెజారిటీతో అధికారంలో కొనసాగుతున్న కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప వచ్చే మూడేళ్ళలో తనకు ఎలాంటి ముప్పు రాకుండా చేయడం కోసం మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్దరామయ్యతో లాలూచి పడుతున్నారనే ఇప్పుడు రాజకీయ వర్గాలలో కధనం హల్ చల్ చేస్తున్నది. సిద్దరామయ్య ఏమడిగినా ప్రభుత్వం వెంటనే తల ఉపుతున్నది. చివరకు సిద్దరామయ్య అసెంబ్లీలో ప్రసంగిస్తుండగా, ఆయన ప్రసంగానికి అడ్డుపడుతున్న బిజెపి సభ్యులను స్వయంగా ముఖ్యమంత్రి సర్ది చెప్పి కూర్చోబెడుతున్నారు. సిద్ధరామయ్య నియోజకవర్గం బాదామికి సీఎం […]

Written By: Neelambaram, Updated On : February 29, 2020 4:05 pm
Follow us on

బొటాబొటి మెజారిటీతో అధికారంలో కొనసాగుతున్న కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప వచ్చే మూడేళ్ళలో తనకు ఎలాంటి ముప్పు రాకుండా చేయడం కోసం మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్దరామయ్యతో లాలూచి పడుతున్నారనే ఇప్పుడు రాజకీయ వర్గాలలో కధనం హల్ చల్ చేస్తున్నది. సిద్దరామయ్య ఏమడిగినా ప్రభుత్వం వెంటనే తల ఉపుతున్నది.

చివరకు సిద్దరామయ్య అసెంబ్లీలో ప్రసంగిస్తుండగా, ఆయన ప్రసంగానికి అడ్డుపడుతున్న బిజెపి సభ్యులను స్వయంగా ముఖ్యమంత్రి సర్ది చెప్పి కూర్చోబెడుతున్నారు. సిద్ధరామయ్య నియోజకవర్గం బాదామికి సీఎం యడియూరప్ప ఏకంగా రూ. 600 కోట్లను విడుదల చేశారు. సిద్ధరామయ్య ఏమి అడిగినా యడియూరప్ప లేదనే మాట చెప్పడం లేదు.

గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం కుమారస్వామి ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం సిద్ధరామయ్యకు ఏ మాత్రం ఇష్టం లేదు. తనకు కాకుండా మాజీ ప్రధాని హెచ్ డి దేవెగౌడ కుమారుడు కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడంతోనే ఆగ్రహంతో జెడిఎస్ నుండి వైదొలిగి, కాంగ్రెస్ లో చేరి, ఆ పార్టీ నుండి ముఖ్యమంత్రిగా ఐదేళ్లు ఉన్నారు. గత ఎన్నికలలో ఓటమి చెందిన ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు.

తన సన్నిహితులకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదని, సీఎం కుమారస్వామి ఏకపక్షంగా నడుచుకుంటున్నారని అంటూ బహిరంగంగానే సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. చివరకు సిద్ధరామయ్య శిష్యులే ఎక్కువమంది అసమ్మతి ఎమ్మెల్యేల శిబిరంలో చేరడంతో ప్రభుత్వం కూలిపోయి యడియూరప్ప ముఖ్యమంత్రి కాగలిగారు.

ఇప్పటికే 77 ఏళ్ళ వయస్సులో ఉన్న తనకు మరో సారి ముఖ్యమంత్రి పదవి లభించే అవకాశం రాకపోవచ్చని, ఎట్లాగైనా ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం యడియూరప్ప వ్యూహాత్మకంగా సిద్దరామయ్యతో సాన్నిహిత్యం నెరుపుతున్నట్లు కనబడుతున్నది. ఇద్దరు ఒకేసారి 1983లో అసెంబ్లీలో అడుగుబెట్టారు. అప్పటి నుండి ఒకరు అధికార పక్షంలో ఉంటె, మరొకరు ప్రతిపక్షంలో ఉంటూ వస్తున్నారు.

దేవెగౌడ, కుమారస్వామిల కంటే యడియూరప్ప మేలు అని సిద్ధరామయ్య భావించినట్లు తెలుస్తోంది. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ నుంచి బలమైన అభ్యర్థిని నిలపకుండా బీజేపీకి సాయం చేశారనే విమర్శలున్నాయి. 27న జరిగే యడియూరప్ప పుట్టినరోజు వేడుకలకు యడ్డి కుమారుడు విజయేంద్ర వెళ్లి స్వయంగా సిద్ధరామయ్యను ఆహ్వానించారు. దానితో యడియూరప్ప పుట్టినరోజు వేడుకలకు సిద్ధరామయ్య హాజరై పొగడ్తలతో ముంచెత్తారు.

సంక్షోభం ఎదురైనప్పుడల్లా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని ఆదుకొంటున్న డీకే హరికుమార్ కు వ్యతిరేకంగా సిద్దరామయ్య పావులు కదుపుతున్నారు. హరికుమార్ కు పార్టీ నాయకత్వం అప్పజెప్పితే యడియూరప్ప ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉన్నదనే సంకేతాలు వెడుతుండటం ఈ సందర్భంగా గమనార్హం.